Thursday, March 28, 2024

యాదాద్రి భువనగిరిలో కానిస్టేబుల్ అదృశ్యం…

- Advertisement -
- Advertisement -

Gundala constable missing in Yadadri bhongiri

 

యాదాద్రి భువనగిరి: ఓ కానిస్టేబుల్ అదృశ్యమైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీస్ స్టేషన్‌లో పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. జలీల్ పటేల్ అనే కానిస్టేబుల్ గుండాల పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నారు. జలీల్ పటేల్‌ను నల్లగొండ పిఎస్‌కు బదిలీ చేశారు. నల్లగొండకు వెళ్లడం తనకు ఇష్టం లేదని, తనని అన్యాయంగా బదిలీ చేశారని తన సోదరుడు రశీద్ పటేల్‌కు ఫోన్ చేసి చెప్పాడు. తరువాత ఫోన్ స్విచ్ఛాప్ ఆఫ్ రావడంతో అప్పటి నుంచి అతడి జాడ తెలియడం లేదు. జలీల్ తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News