Home జయశంకర్ భూపాలపల్లి గుండ్రాతిపల్లి రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం

గుండ్రాతిపల్లి రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం

Gundrathipally farmers All rights reserved

మన తెలంగాణ/భూపాలపల్లి : గుండ్రాతిపల్లి గ్రామ రైతులను చట్టపరంగా అన్నివిధాల ఆదుకొని న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్ కుమార్ అన్నారు.సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అన్నారం బ్యారేజి నిర్మాణం కింద భూములను కోల్పోయిన కాటారం మండలం గుండ్రాతిపల్లి గ్రామానికి చెందిన రైతులు మంథని ఉమ్మేల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి భూములు కోల్పోయిన మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిలో పునరావాసం క్రింద మా పేర్లను చేర్చి న్యాయం చేయాలని కోరారు. వాజేడు వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన అందుడు బెజ్జరి శ్రీనివాస్ అక్ష్మయ్యలు మాకు ఇచ్చి న పట్టాదారు పాసుబుక్కుల వివరాలను కంప్యూటర్‌లో చేర్చాలని, మొర్రవానిగూడెంకు చెందిన శ్రీరామాంజనేయ ఆదివాసి ఇసు క క్వారీ కాంట్రాక్ట్ మ్యూచ్‌వల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన ఆదివాసి మహిళలు మాపీసా గ్రామ పరిధిలో గోదావరి నదిపై ఇసుక మేటలు వేసినందుకు ఇసుక రీచ్ పెట్టుకునుటకు గ్రామ పంచాయితి,గ్రామ పెద్దలు ,గ్రామ సభ్యులు గోదావరిలోగల ఇసుక ను వెలికి తీయుటకు సొసైటి రిజిస్ట్రేషన్ కొరకు అనుమతి ఇప్పించి రెవిన్యూ మరియు మైనింగ్ అధికారులను ఆదేశించి మాబీద ఆదీవాసులను ఆదుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.ములుగు మండలం మధనపల్లి గ్రామానికి చెందిన 10 మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన డబుల్ బెడ్‌రూం  ఇండ్లను మంజూరు చేయాలని కోరారు.మంగపేట మండలం కమలపురం గ్రామానికి చెందిన ఎస్‌టి నాయకపోడు 60 మంది మాకు ఉండడానికి ఇండ్లు,భూమికూడ లేనందుకు ప్రభుత్వం స్థలం ఇప్పించి అందులో డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వేడుకున్నారు.ఆదే గ్రామానికి చెందిన బైరి సమ్మక్క మాది కడుపేద కుటుంబం నాభర్త అనారోగ్యంతో మృతి చెందాడు మాకు ఒక్క కూతురు వ్యవసాయ భూమి కాని ఇతర ఆస్తులు ఎమి లేనందున గతంలో కూరగాయల దుకాణం పెట్టుటకై ఎస్‌టి డ్రైకార్ కింద లోనుకు అర్జీపెట్టుకున్నాను మాగ్రాంలో గ్రామసభలో పెద్దమనుష్యలు నాపేరు లోను పెట్టుటకు అంగీకరించారు.కాని ఇంతవకు లోను మంజూరు కాలేదు కావున తమరు మాకు లోను మంజూరు అయ్యేవిదంగా అధికారులను ఆదేశించాలని కోరారు.జిల్లాలో వివిధ గ్రామాలనుండి భూ ప్రక్షాళణ సవరింపులో తమ పేర్లు మరియు భూమి విస్థీర్ణం తప్పుగా పడిందని సుమారు 60 మంది రైతులు ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడతూ..త్వరలోనే మీసమస్యలను పరిష్కారం చూపి భూరికార్డులను సత్వరమే సవరించి మీకు న్యాయం చేస్తామని అన్నారు.ప్రజావాణిలో మొత్తం 122 ఫిర్యాదులు వచ్చాయి.ఈకార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి పి మోహన్‌లాల్,డిఎఫ్‌ఓ రవికిరణ్,సీపిఓ డి కొంరయ్య,ఎస్సీ సంక్షేమ అధికారి సజీవన్,బిసి సంక్షేమ అధికారిణి శైలజ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.