Friday, March 29, 2024

రష్యా స్కూల్ లో కాల్పులు: 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Russian School attack

సాయుధుడు ఆత్మహత్య చేసుకున్నాడు

మాస్కో: సెంట్రల్ రష్యాలోని ఇజెవ్స్క్ నగరంలోని పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు చిన్నారులు సహా కనీసం 13 మంది మరణించారని పరిశోధకులు సోమవారం తెలిపారు. “ఈ నేరం కారణంగా విద్యా సంస్థకు చెందిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఐదుగురు మైనర్లతో సహా తొమ్మిది మంది మరణించారు” అని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ టెలిగ్రామ్‌లో  పేర్కొంది, దాడి చేసిన వ్యక్తి “ఆత్మహత్య చేసుకున్నాడు” అని పేర్కొంది.

పరిశోధకుల ప్రకారం, “అతను నాజీ చిహ్నాలు,  బాలాక్లావాతో నల్లటి టాప్ ధరించాడు, ఎటువంటి ఐడిని కలిగి లేడు.అతని గుర్తింపు ప్రస్తుతం నిర్ధారించబడుతోంది”  అని పరిశోధకులు చెప్పారు.  ఈ దాడిలో దాదాపు 20 మంది గాయపడ్డారని రష్యా అంతర్గత వ్యవహారాల శాఖ కూడా వెల్లడించింది. ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచలోవ్  వీడియో ప్రకటనలో మాట్లాడుతూ, “పిల్లల్లో చనిపోయినవారు , గాయపడినవారు” ఉన్నట్లు ధృవీకరించారు.

సహాయక,  మెడికల్ వర్కర్లు ఘటనా స్థలంలో పని చేస్తున్న నేపథ్యంలో, కొందరు స్ట్రెచర్లతో పాఠశాల లోపలికి పరుగులు తీస్తున్నారు. దాదాపు 630,000 మంది జనాభా కలిగిన నగరం, ఇజెవ్స్క్ అనేది రష్యా యొక్క ఉడ్ముర్ట్ రిపబ్లిక్ యొక్క ప్రాంతీయ రాజధాని, ఇది మాస్కోకు తూర్పున 1,000 కిలోమీటర్లు (620 మైళ్ళు) దూరంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News