క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు ఎస్.కె.సత్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరోడు’. అద్భుతమైన కథ కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. మార్చి 3న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వరుణ్ అట్లూరి మాట్లాడుతూ “లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుంటూరోడు’. సినిమాలో మనోజ్ తన యాక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తారు. సినిమా ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటున్న మా చిత్రాన్ని మార్చి 3వ తేదీన విడుదల చేయబోతున్నాం”అని అన్నారు. రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, సంపత్, పృథ్వీ, ప్రవీణ్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః శ్రీవసంత్, సినిమాటోగ్రఫీః సిద్ధార్థరామస్వామి, ఎడిటర్ః కార్తీక శ్రీనివాస్, ఫైట్స్ః వెంకట్.
మార్చి 3న వస్తున్న ‘గుంటూరోడు’
- Advertisement -
- Advertisement -