Saturday, April 20, 2024

వెబ్‌సైట్‌లో గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

Gurukul Entrance Exam Hall Tickets on Website

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆయా సొసైటీల వెబ్‌సైట్ల ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలని పేర్కొన్నారు. వచ్చే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News