Home తాజా వార్తలు గుత్తా ఏకగ్రీవం

గుత్తా ఏకగ్రీవం

Gutta-Sukender-Reddy

మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ ఎంపి, టిఆర్‌ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్ సి ఎన్నిక నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగిసింది. గుత్తా ఒక్కరే నామినేషన్ దాఖలు చేసి ఉండటంతో ఆయ న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అ ధికారులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి గెలుపు ధ్రువపత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జి.జగదీష్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపి బ డుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎం పి బూర నర్సయ్య గౌడ్, ఎంఎల్‌సి క ర్నె ప్రభాకర్, ఎంఎల్‌ఎలు గొంగిడి సు నీత, రవీంద్రకుమార్, గ్యాదరి కిశోర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మీడియాతో మాట్లాడుతూ, మూడు సార్లు ఎంపిగా ఎన్నికైన తనకు ఎంఎల్‌సిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు,మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. సిఎం తనకు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. గతంలో ఎంపిగా ప్రజలకు సేవ చేసినట్లుగానే, ఎంఎల్‌సిగానూ ప్రజలతో మమేకమై పనిచేస్తానని చెప్పారు. ప్రజా సేవకే తన ఎంఎల్‌సి పదవిని వినియోగిస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని కొనియాడారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా రైతులకు సేవ చేసే అవకాశం ఇచ్చిన సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

Gutta Sukhender Reddy unanimously elected as MLC