Home తాజా వార్తలు ప్రోగ్రాం మేనేజర్ నియామకాలకు ఇంటర్వూ…

ప్రోగ్రాం మేనేజర్ నియామకాలకు ఇంటర్వూ…

GVK EMRIగోషామహల్: జివికెఇంఎంఆర్‌ఐలో ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ హె చ్‌ఆర్ విభాగం ముఖ్యఅధికారి సుహాస్‌చరణ్ పేర్కొన్నారు. బిఎస్సీ లైఫ్ సైన్స్‌తో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, 40 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు అ ర్హులని తెలిపారు. సూపర్‌వైజర్ విధుల్లో కనీసం 5 సంవత్సరాల అనుభవంతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చదవడం, రాయడంలో ప్రావీణ్యం, ఇతరులతో సం భాషించే నైపుణ్యంతో పాటు టీం లీడర్ గా సమర్దత, హిందీ భాషలో మాట్లాడే సామర్దం కలిగి ఉండి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్దంగా ఉన్న అభ్యర్థులు ఈ నియామకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ నియామకాల కోసం ఈ నెల 9న ఉదయం 10 గంట ల నుండి సాయంత్రం 5 గంటల వరకు కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలోని జివికెఇఎంఆర్‌ఐ 108 కార్యాలయంలో ఇంటర్వూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు ఒరిజినల్స్ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వూకు హాజరుకావాలని కోరారు. ఇతర వివరాలకు 7995061581 ఫోన్‌నెంబర్ లో సంప్రదించాలని కోరారు.

GVK EMRI Program Manager Interviews