Home తాజా వార్తలు వరంగల్ కార్పొరేషన్ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

వరంగల్ కార్పొరేషన్ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

GWMC Election Reservations Releaseవ‌రంగ‌ల్ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో కార్పొరేషన్ రిజ‌ర్వేష‌న్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారులు గురువారం విడుద‌ల చేశారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌రిధిలోని 66 డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖరారయ్యాయి.  65వ డివిజ‌న్ ఎస్టీ మ‌హిళ‌కు, 2వ డివిజ‌న్ ఎస్టీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 1, 3, 14, 43, 46 డివిజ‌న్లు ఎస్సీ మ‌హిళ‌ల‌కు, 15, 17, 18, 37, 47, 53 డివిజ‌న్ల‌ను ఎస్సీ జ‌న‌ర‌ల్‌కు ,9, 16, 23, 25, 32, 33, 36, 38, 42, 54 డివిజ‌న్ల‌ను బీసీ మ‌హిళ‌ల‌కు, 6, 10, 12, 20, 21, 26, 34, 39, 40, 41 డివిజ‌న్లు బీసీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 8, 11, 19, 24, 28, 29, 30, 44, 48, 49, 50, 55, 57, 58, 59, 63 డివిజ‌న్ల‌ను జ‌న‌ర‌ల్ మ‌హిళ‌ల‌కు కేటాయించారు. 66 డివిజన్లలోని 298 ప్రాంతాల్లో 878 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్‌ స్టేషన్లలో 800 ఓట్లకు మిం చకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు వెల్లడించారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరమే పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగకుండా పర్యవేక్షణకు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ బృందాలను  ఎన్నికల సంఘం నియమించింది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 వర కు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ బృందాలు పర్యవేక్షణ చేస్తాయి. ప్రతి బృందంలో తహసీల్లార్లు, ఇరిగేషన్‌ అ ధికారులు, పోలీస్‌ అధికారులు, వీడియో గ్రాఫర్‌ ఉంటారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.