Friday, April 19, 2024

జుట్టు ఊడిపోతుందా?

- Advertisement -
- Advertisement -

 

మగువలకు శిరోజాలు అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అలాంటి జుట్టును సొంతం చేసుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ఎంత పోషణ చేసినా ఊడిపోవడం అనేది తరచూ జరుగుతూనే ఉంటుంది. అలా ఊడిపోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
* ఉసిరికాయలను ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టాలి. ఎండిన ఈ ముక్కలను కొబ్బరి నూనెలో వేసి వేడి చేసి ఒక రాత్రంతా ఉసిరి ముక్కలను నూనెలో ఉంచి, మరుసటి రోజు వాటిని తీసేసి ఆ నూనెను తలకు రాసుకోవాలి. ఈ నూనెలో కొన్ని రోజుల పాటు వాడితే జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. అలాగే బలంగా పొడవుగా పెరుగుతుంది.
* ప్రతిరోజూ కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే దీనివల్ల నిగారింపు వస్తుంది. ఊడటం తగ్గుతుంది.
* కొత్తిమీర రసాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఊడడం నిరోధించవచ్చు.
* రోజూ బాదం నూనెతో కుదుళ్ల నుండి మూడు సార్లు మర్దనా చేసుకోవాలి. బాదం నూనె హెయిర్ ఫాల్‌ని బాగా తగ్గిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు కూడా మృదుత్వం సంతరించుకుంటుంది.

hair loss tips telugu lo

 

Hair fall solution telugu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News