- Advertisement -
న్యూయార్క్ : అమెరికాలో జాతి విద్వేషం ఆగడం లేదు. దానికి ఉదాహరణగా ఏప్రిల్ 26 న నల్లజాతీయుడొకరు సిక్కు యువకునిపై సుత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో ఆ నల్ల జాతీయుడు నువ్వంటే నాకిష్టం లేదు, నీశరీరం రంగు నాలా లేదు అని ద్వేషంతో కేకలు వేసినట్టు తెలిసింది. బ్రూక్లిన్ లోని ఒక హోటల్‌లో 32 ఏళ్ల సుమిత్ అహ్లు వాలియా అనే సిక్కు యువకునిపై ఈ దాడి జరిగింది. అహ్లు వాలియా పనిచేస్తున్న క్వాలిటీ ఇన్ హోటల్‌కు ఆరోజు ఓ నల్ల జాతీయుడు వచ్చాడు. హోటల్ లాబీ లోకి ఉదయం 8 గంటల ప్రాంతంలో వచ్చి పెద్ద కేకలు వేయడంతో తాను వెళ్లి అనునయంగా మాట్లాడినా ఆయన వినిపించుకోకుండా తనలా నేను నల్లగా లేనని కేకలు వేశాడని అహ్లు వాలియా చెప్పాడు. తన జేబులో నుంచి సుత్తి తీసి తన తలపై మోదాడని అహ్లువాలియా చెప్పాడు. జాతి వివక్షతో దాడి జరిగిందా అన్న కోణంలో న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -