Home నిర్మల్ ఇంత నిర్లక్ష్యమా…?

ఇంత నిర్లక్ష్యమా…?

Hand-bore-pump

చేతి పంపులపై పర్యవేక్షణ కరువు
తుప్పు పడుతున్న చేతి పంపులు
ప్రారంభమైన నీటి ఎద్దడి
పత్తాలేని అర్‌డబ్లూఎస్ అధికారులు

కుభీర్: గ్రామాల్లో నీటి ఎద్దడి రోజురోజుకూ ఎక్కువవుతోంది. నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలంటూ, ప్రభుత్వం చెబుతున్నా అధికారులు మాత్రం అవేమీ పట్టనట్లుగా మొక్కుబడి పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇందుకు మండలంలోని చేతిపంపులను నిదర్శనంగా చెప్పవచ్చు. 20 గ్రామపంచాయతీలు గల కుభీర్ మండల పరిధిలో సుమారు 512 చేతి పంపులు ఉన్నాయి. అయితే ఇందులో సగానికి పైనే పనిచేయడంలేదు. వీటిని బాగు చేసేందుకు హెల్పర్లు లేరు. సరైనా సామాగ్రి ఉన్న మరమత్తుకు నోచుకోవడం లేదు. దీంతో ఆ చేతిపంపులు రిపేర్ కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఆ నిధులను ఏం చేశారో తెలియని పరిస్థితి. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇంటింటికి చందాలు వసూలు చేసి, చేతిపంపులు మరమత్తులు చేసుకుంటున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ఆర్‌డబ్లూఎస్ అధికారులు గ్రామాల్లో తిరిగి నీటి సమస్యలు పరిష్కరించిన దాఖలాలు కనిపించడం లేదని, పలువురు అంటున్నారు.

మండల కేంద్రం కుభీర్‌తోపాటు మండలంలోని దార్‌కుబీర్, హల్దా, చొండి, నిగ్వా, సొనారి, పలు తండాలలో చేతి పంపులు పూర్తిగా చెడిపోయి, సంవత్సారాలు గడుస్తున్నా వాటికి మరమత్తు చేసే నాథుడే కరువయ్యారని, ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే మర్లగుండా గ్రామపంచాయతీ పరిధిలోని తండాలలో, రంగాశివ్ని తాండా1, తాండా2లో, పల్సి తాండా, అంతర్ని, అంతర్ని తాండాలను నీటి ఎద్దడి గ్రామాలుగా గుర్తించారు. అయినా ఆయా గ్రామాల్లో నీటి సమస్య పరిష్కరానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

వేసవి ప్రారంభంలోనే నీటి సమస్య మొదలయింది. మునుముందు నీటి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం పొంచి ఉన్నందున అధికారులు స్పందించి, నీటి సమస్య ఉన్న గ్రామాలలో నీటి సమస్య పరిష్కారానికి ముందస్తు చర్యలు చేపాట్టాలని, పలువురు కోరుతున్నారు. గత సంవత్సరం వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో మండలంలోని పలు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూగర్భ జలాలు పెరగడంతో చేతి పంపుల ద్వారా నీటి సరఫరా చేస్తే, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, పలువురు అంటున్నారు.