Thursday, April 25, 2024

వాకింగ్ కోసం వెళ్తే… చేతిలో రాడ్ ఇరుక్కుంది….

- Advertisement -
- Advertisement -

అమరావతి: మెడికల్ కాలేజీ విద్యార్థి వాకింగ్ కోసమని ఓ పాఠశాల గ్రౌండ్ వెళ్లాడు. గేటు లాక్ వేయడంతో దూకడానికి ప్రయత్నిస్తుండగా చేతిలోనికి గేట్ రాడ్ ఇరుక్కున్న సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని పుల్లారెడ్డి జడ్‌పి ఉన్నత పాఠశాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలో నిఖిల్ నాయక్ అనే విద్యార్థి ఎంబిబిఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వాకింగ్ కోసమని పుల్లారెడ్డి పాఠశాలకు వెళ్లగా లాక్ వేయబడి ఉంది. గేటు లోపలికి దూకుతుండగా కాలు జారడంతో చేయి గేటు రాడ్‌లో ఇరుక్కపోయింది. రాడ్‌లో నుంచి చేయి ఎంత ప్రయత్నించిన బయటకు రాకపోవడంతో స్థానికుల సమాచారం మేరకు పల్నాడు ఆస్పత్రి వైద్యులు అక్కడికి చేరుకొని అతడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అనంతరం రెండు గంటల కష్టపడి రాడ్ నుంచి చేతిని వైద్యులు బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News