Home మెదక్ రెండు గుళ్లలో చోరి

రెండు గుళ్లలో చోరి

Handy stolen in Ramayyam peta tempul
రామాయంపేట : రెండు గుళ్లలో దొంగలు పడి హుండీ ఎత్తుకెల్లిన ఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఆలయ పూజారులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణం శివారులోని కాశగుట్టపై ఉన్న మల్లన్న, ఎల్లమ్మ దేవాలయాల్లో దొంగుల పడి అక్కడ ఉన్న హుండీని ఎత్తుకెల్లారు. దాన్ని ఆ ప్రక్కనే పగుల కొట్టి అందులో ఉన్న నగదును తీసుకుపోయి దాన్ని అక్కడే వదిలి వెల్లారు. అందులో సుమారు రెండు నుంచి మూడు వేల వరకు డబ్బులు ఉండ వచ్చని వారు తెలిపారు. అలాగే ఆ ప్రక్కనే ఉన్న పెద్దమ్మ దేవాలయం తాళం పగుల కొట్టారు. అలజడి విన్న అక్కడి పూజారి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకునే వరకు దొంగలు పరారయ్యారు.