Home తాజా వార్తలు తొలిసారి లాయర్ పాత్రలో

తొలిసారి లాయర్ పాత్రలో

Hansika

 

శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై యంగ్ హీరో సందీప్ కిషన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న హన్సిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో ఈ బ్యూటీ ఫార్మల్‌గానే దర్శనమిచ్చింది. అయితే ఈ చిత్రంలో హన్సిక లాయర్ పాత్రలో కనపడుతోంది. తొలిసారి ఈ భామ లాయర్ పాత్రలో నటిస్తుండటం విశేషం. వరలక్ష్మి శరత్ కుమార్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.

జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. టాకీపార్ట్ అంతా పూర్తయింది. కేవలం పాటలను చిత్రీకరించాల్సి ఉంది. సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని, సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. బ్రహ్మానందం, వెన్నెలకిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘుబాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ, సత్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీశ్, స్క్రీన్‌ప్లే: రాజు, గోపాల కృష్ణ ఆర్ట్: కిరణ్, యాక్షన్: వెంకట్.

Hansika is playing Lawyer in TenaliRamakrishna b.a b.l