Home సినిమా ‘హ్యాపీ బర్త్ డే’ నేషనల్ స్టార్ ప్రభాస్

‘హ్యాపీ బర్త్ డే’ నేషనల్ స్టార్ ప్రభాస్

Happy Birthday Prabhas

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇవాళ 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.’బాహుబలి’తో జాతీయస్థాయిలో గుర్తింపుతో నేషనల్ స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ప్రస్తుతం కుర్ర దర్శకుడు సుజిత్ తో ‘సాహో’ సినిమా చేస్తున్నాడీ డార్లింగ్. ఆరడుగుల ఆజానుబాహుడు అనే మాటకు అసలు సిసలు మినింగ్. హీరో అంటే ఇలా ఉండాల్రా అనిపించే కటౌట్. 2002లో వచ్చిన ‘ఈశ్వర్’ మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ప్రభాస్. 16 ఏళ్ల కెరీర్ లో చేసినవి 18 సినిమాలు. హిట్టొచ్చిన కాలర్ ఎగరేయడు.. ఫ్లాప్ వచ్చిన కుంగిపోడు. జానర్ ఏదైన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందా లేదా అన్నదే ప్రభాస్ కాన్సెప్ట్. అందుకే సక్సెఫుల్ మంత్రతో దూసుకెళ్తున్నాడు. అమ్మాయిల మనసుదోచి కలల రాకుమారుడయ్యాడు.

వర్షంలో డ్యూయెట్లు పాడాలన్నా.. శత్రువులను పరుగులు పెట్టించే ఛత్రపతి కావాలన్నా.. అమ్మ ప్రేమ కోసం పరితపించే కొడుకుగా ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించే యోగిగా మారాలన్నా.. కుటుంబ బంధాలను గుర్తు చేసే మిస్టర్ పర్‌ఫెక్ట్ కావాలన్నా.. స్టైలిష్ లుక్‌తో బిల్లాగా మెరిపించాలన్నా.. బాహుబలిగా చరిత్రపుటల్లోకెక్కాలన్నా ఒన్ అండ్ ఓన్లీ డార్లింగ్ ప్రభాస్‌‌కే చెల్లింది.  సినిమా సినిమాకు ప్రతి పాత్రలోనూ వైవిధ్యాన్ని చూపించే స్టార్ ప్రభాస్ అనడం ఎలాంటి సందేహం లేదు. ఇన్ని సూపర్ క్వాలిటీస్ ఉండటం వల్లే నేషనల్ స్టార్‌గా మారాడు ఈ యంగ్ రెబర్ స్టార్.

ఇక త్వరలో రాబోతున్న ‘సాహో’లో సైతం వైవిధ్యమైన పోరాట సన్నివేశాలు ఉన్నాయట. వీటి ద్వారా మునుపెన్నడు చూడని ప్రభాస్ ను చూడబోతున్నరంటూ చిత్ర బృందం చెబుతోంది. ఈ మూవీ తర్వాత జిల్ ఫేం రాధకృష్ణతో కూడా పాతకాలంనాటి ప్రేమకథతో రానున్నాడు డార్లింగ్. ఇలా విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో రెబల్ స్టార్ సక్సెస్ అవుతున్నాడు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు, ఆయన అభిమానులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరిన్ని అద్భుత చిత్రాలతో సినీ అభిమానులను అలరించాలని ఆశిస్తూ మరోసారి నేషనల్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదాం.

Happy Birthday Young Rebel Star Prabhas.

Telangana Breaking News