Friday, April 19, 2024

నాకు నువ్వు నీకు నేను

- Advertisement -
- Advertisement -
Valentines-Day
ప్రేమ పదాలు రెండు అయినా అదో తీయని అనుభూతి.. చెప్పలేని..మధురానుభూతి.. ఒక మనస్సు ఇంకో మనస్సు కోసం నిత్య ఆరాధన.. దీనికి తారతమ్యం కానీ .. ఎల్లలూ అడ్డురానే రావు.. అదే ప్రేమ మహత్యం…

హైదరాబాద్: ఫిబ్రవరి 14న ఎందుకు ప్రేమికులు రోజును జరుపుకోవాలి అని అనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం నేటి యువకు ఉంది. క్రీస్తుశకం 270 ప్రాంతంలో రోమ్‌లో వాలెంటైన్స్ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. ప్రేమవల్ల ప్రపంచం ఆహ్లాదంగా, ఆనందంగా మారుతుందని అతని అభిప్రాయం. అందుకే రహస్యంగా యువతీ,యువకులను ప్రేమోపదేశాలు చేసి , వారిలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించాడు. వాలెంటైన్స్‌కు రోజురోజుకు అభిమానులు పెరిగిపోవడంతో రోమ్ రాజు క్లాడియస్‌కి భయం పట్టుకుంది. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనంగా తయారు చేస్తున్నాడన్నాడనే అభియోగంపై క్లాడియస్ వాలెంటైన్‌కి మరణశిక్ష విధించాడు.

వాలెంటైన్ అభిమానుల్లో క్లాడియస్ కుమార్తె కూడా ఉండటం విశేషం.

ప్రేమకు మారు పేరుగా మారిన వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరి తీశారు. వాలెంటైన్ మరణించిన తరువాత రెండు దశాబ్దాలకు క్రీ.శ. 496లో అప్పటి పోప్, గెలాసియస్స్ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా ప్రకటించారు. ఎక్కడో రోమ్‌లో ,అది శతాబ్దాల క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈప్రేమికుల రోజు ఇప్పడు ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవం గా మారిపోయింది.

Happy Valentines Day 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News