Saturday, April 20, 2024

క్రెమిస్ట్రీ పబ్ కుక్‌పై అత్యాచారం కేసు

- Advertisement -
- Advertisement -

Harassment case against Chemistry Pub Cook

వివాహం చేసుకుంటానని మోసం
కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

హైదరాబాద్: యువతితో సహజీవనం చేసి వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేసిన కెమిస్ట్రీ పబ్ కుక్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. ఒరిసా రాష్ట్రానికి చెందిన సత్యజిత్ బేరా జూబ్లీహిల్స్‌లోని కెమిస్ట్రీపబ్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడు. అదే పబ్బులో పనిచేస్తున్న ఎపికి చెందిన యువతితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరు కలిసి గత కొంత కాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. వివాహం చేసుకుంటానని యువకుడు నమ్మించడంతో పలుమార్లు శారీరకంగా కలిశారు. యువతి కొద్ది రోజుల నుంచి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయగా నిందితుడు తప్పించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సత్యజిత్ బేరాను వివాహం చేసుకోవాలని యువతి నిలదీయడంతో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో వివాహం పేరుతో తనతో సంబంధం పెట్టుకుని మోసం చేశాడని బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News