Tuesday, July 8, 2025

లైంగిక వేధింపులు.. చిక్కుల్లో వెస్టిండీస్ క్రికెటర్

- Advertisement -
- Advertisement -

వెస్టిండీస్ సీనియర్ జాతీయ జట్టుకు చెందిన ఓ క్రికెటర్ (West Indies Cricketer) చిక్కుల్లో పడ్డాడు. అతనిపై లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఓ యువతి సహా మరికొంత మంది మహిళలు ఆ క్రికెటర్‌పై ఈ ఆరోపణలు చేస్తూ.. గయానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 3, 2023న బైర్బైన్‌లోని న్యూ ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఒక నివాసంలో ఆ క్రికెటర్ తనపై లైంగిక దాడి చేశాడని అప్పుడు 18 సంవత్సరాల వయస్సు ఉన్న యువతి, ఆమె కుటుంబం ఆరోపణ చేసింది. కేసును కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేశారని వారు అన్నారు.

ఈ యువతి ఫిర్యాదుతో మరికొంత మంది మహిళలు కూడా ఇలాంటి ఆరోపణలతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారు. సదరు క్రికెటర్ (West Indies Cricketer) పంపిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లు, వాయిస్ మెసేజ్‌లతో సహా పలు ఆధారాలను సమర్పించినట్లు సమాచారం. అయితే క్రికెటర్‌పై వచ్చిన ఆరోపణలు, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి విషయాలు ఇప్పుడే తమ దృష్టికి వచ్చాయని క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు కిషోర్ షా అన్నారు. ఈ విషయంపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని తెలిపారు. వెస్టిండీస్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News