Home ఆంధ్రప్రదేశ్ వార్తలు నైట్ క్లాసుల పేరుతో విద్యార్థులపై వేధింపులు…

నైట్ క్లాసుల పేరుతో విద్యార్థులపై వేధింపులు…

Students

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీఓ కాలనీలోని ఓ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. టీచర్లు విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో తమను స్కూల్ లో టీచర్లు విపరీతంగా వేధిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర వాపోయారు. కాగా, గురువారం ఓ విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు సమాచారం. దీంతో నైట్ క్లాసుల పేరుతో తమ పిల్లలను విపరితంగా వేధిస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలు తీసి విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని టీచర్లపై టూటౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే, స్కూల్ యాజమాన్యం మాత్రం కేవలం స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులను వేధించలేదని పేర్కొంది.

harassment on students under name of special class