మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి : కష్టపడికాకుండా ఇష్టపడి చదివి ప్రతి భావంతులుగా ఎదిగి ఉన్నతశిఖరాలను అధిరోహించాలని జాగృతి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ బి.సూర్యనారయణరెడ్డి అన్నారు. మహాత్మగాంధీ యూని వర్సిటీ 2017-18 సం॥ ప్రకటించిన డిగ్రీ మొదటి, మూడవ సెమిస్టర్ ఫలితాలలో యూనివర్సీటీ స్థాయిలో సంచలనం సృష్టించిన జాగృతి కళాశాల విద్యార్ధులకు పట్టణంలోని అదే కళాశాల ఆవరణలో శనివారం ఏర్పాటుచేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్యాపకుల ఆలోచనలను భోదనా విధానంలో విద్యా ర్థులు అమలు చేసిన ఫలితమే ఈ ఫలితాలని ఆయన అభివర్ణించారు. 10కి 10 జిపిఎ సాధించిన విద్యార్థులకు ఆయన చేతులమీదుగా గోల్డ్, సిల్వరు, నగదు ప్రోత్సాహక బహుమతులను ఆయన చేతులమీదుగా అందజేశారు. ఉత్తమ ఫలితాలను సాధించిన ఎ.తేజస్విని, ఎస్.మెఘన, కుల్‌సుంభేగం, కావ్యలు 10జిపిఎకు 10 సాధించగా 9.93 పి.పావని ఆర్.దుర్గాభవాని సుర్విహారికలు, 9.85 ఎం. ప్రియతో పాటుగా 23 మంది విద్యార్ధులు 9.0 (111)మంది విద్యార్ధులు వివిధ సబ్జెక్టులలో గ్రేడులు సాధించినట్లు ఆయన ప్రకటించారు. ఈ ఫలితాలు సాధించిన వారిలో ఎస్‌ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల, యూనిటీ, టైమ్స్, శ్రీచైతన్య కళాశాలలకు చెందిన విద్యార్ధులు ఉన్నారు. ఈ అభినందన సభలో ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎ.మణిపాల్‌రెడ్డి, అకాడమిక్ కో-ఆర్డినేటర్ సిహెచ్ నవీన్, ఎస్‌ఎస్‌ఆర్ ప్రిన్సిపాల్ సింగనబోయిన మల్లేశం, శ్రీవైష్ణవి ప్రిన్సిపాల్ మధిర మల్లేశం, యూనిటీ ప్రిన్సిపాల్ ఆకుల సుధాకర్, టైమ్స్, శ్రీచైతన్య ప్రిన్సిపాల్‌లు వై. కొండల్‌రెడ్డి, అద్యాపకులు సిహెచ్ బాలేశ్వర్, బస్వరాజ్, కమళాకర్, ఎల్మారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి
- Advertisement -
- Advertisement -