Thursday, April 25, 2024

పౌరచట్టం సబబే అని తేలింది: పూరి

- Advertisement -
- Advertisement -

Hardeep Puri cites Afghan situation to justify CAA

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరచట్టం సరైనదే అనే విషయం ఇప్పుడు అఫ్ఘనిస్థాన్ పరిణామాలతో స్పష్టం అయిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. పొరుగున ఉండే ముస్లిం మెజార్టీ దేశాలలోని వేధింపులకు గురైన ముస్లింయేతర పౌరులు 2015 కంటే ముందు భారత్‌కు వస్తే వారికి భారత పౌరసత్వం కట్టబెట్టేందుకు ఈ చట్టం ఉద్ధేశించారు. అయితే ఇది వివాదాస్పదం అయింది. హింసాకాండ, పోలీసు కాల్పుల ఘటనటలో దాదాపు 100 మంది వరకూ మృతి చెందారు. ఇప్పుడు మన పొరుగున ఉన్న కల్లోల దేశంలో పరిస్థితులు గమనిస్తే అక్కడున్న సిక్కులు, హిందువులు ఎంతటి బాధాకరమైన దశలో ఉన్నారనేది తెలుసుకోవచ్చునని మంత్రి చెప్పారు. ఇటువంటి దశలో అటువంటి వారిని ఆదుకునేందుకు పౌరసత్వ సవరణ చట్టం అవసరం అయిందని, దీనిని విమర్శించిన వారు ఇప్పుడేం అంటారని ప్రశ్నించారు. భారతదేశం అఫ్ఘనిస్థాన్‌లో చిక్కుపడ్డ భారతీయులనే కాకుండా అక్కడ స్థిరపడి ఉన్న హిందువులను, సిక్కులను అదే విధంగా ఆ దేశం నుంచి తరలిరావాలనుకుంటున్న వారిని తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉంటుందని ప్రధాని మోడీ గత వారం జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో తెలిపారు.

Hardeep Puri cites Afghan situation to justify CAA

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News