Thursday, March 28, 2024

కెటిఆర్ డైనమిక్ లీడర్

- Advertisement -
- Advertisement -

KTR

 

కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురి ప్రశంస

టెక్నాలజీతో విస్తరించనున్న విమానయాన పరిశ్రమ n అతి తక్కువ ఖర్చుతో విస్తరణలు, ఐటి మంత్రిగా కెటిఆర్ చేస్తున్న కృషి అద్భుతం
ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని జిఎస్‌టిలోకి తీసుకురావాలి : కేంద్ర మంత్రి

ఏవియేషన్‌లో అపార అవకాశాలు : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: నేటి కాలంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని విమానయాన పరిశ్రమ రోజురోజు కీ విస్తరిస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. వి మానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీలు సంయుక్తంగా బేగంపేట్‌లో నిర్వహించిన వింగ్ 2020 ఎయిర్ షోను ఆయన శనివారం రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్‌తో కలసి సందర్శించారు.

ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ… ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఆధునిక రంగంలో క్యారియర్లు, ఎఫ్‌డిఐ వంటి కారకాలతో నడిచే విమానయాన పరిశ్రమ కొత్త శకానికి నాంది పలికిందని, అతి తక్కువ ఖర్చుతో విస్తరణలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మంత్రి కెటిఆర్ యంగ్ డైనమిక్ లీడర్ అని కేంద్ర మంత్రి కొనియాడరు. ఐటి మంత్రిగా ఆయన చేస్తున్న పనితీరు అద్భుతమని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని జీఎస్టి పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంద ని, దీనికి రాష్ట్రాల నుంచి మద్దతు కావాలని ఆయన కోరారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం విమానరంగానికే కాకు ండా ఇతర రంగాలపై కూడా ఉందని, వైరస్ నియంత్రణ కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోనుందని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి ఆయన ఛాంబర్‌లో కరోనాపై నిత్యం ఎప్పటి కప్పుడు అన్ని రాష్ట్రాల పరిస్థితులను తెలుసుకుంటున్నారని, కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఐటి మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ…రీజినల్ కనెక్టివిటీ కోసమే పాత విమానాశ్రయాల పునరుద్ధరణ అని తెలిపారు.

విమానాశ్రయాలతో పాటు హెలిపోర్ట్, సీ ప్లేన్‌లపై రాష్ట్రం ఆసక్తిగా ఉందన్నారు. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. వచ్చే 20 ఏళ్లల్లో భారత్‌కు 2400 ఎయిర్ క్రాఫ్ట్‌లు అవసరమన్నారు. నిర్వహణ, మరమ్మతుల కేంద్రం, నైపుణ్యాభివృద్ధికి దృష్టి పెట్టలన్నారు. ఏవియేషన్ రంగంపై జీఎస్టి తగ్గించేందుకు విధానపర నిర్ణయం తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటి ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అధికారులు పాల్గొన్నారు.

డ్రోన్లతో మందుల సరఫరా కార్యక్రమం ప్రారంభం..
దేశంలో ఆరోగ్య రంగం అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వరల్డ్ ఎకానమిక్ ఫోరం, అపోలో సంస్థల ఆధ్వర్యంలో డ్రోన్లతో మందులు సప్లయ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఐటి ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ ప్రారంభించారు. మార్కెట్లో టెక్నాలజిని వినియోగించుకొని వైద్యరంగంను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

 

Hardeep singh said KTR Dynamic Leader
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News