Tuesday, April 23, 2024

ఆ ‘షో’ నా జీవితంలో ఓ పీడకల: హార్దిక్ పాండ్య

- Advertisement -
- Advertisement -

ముంబై: కాఫీ విత్ కరణ్ షో కార్యక్రమం తన జీవితంలో ఓ పీడకల అని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అభివర్ణించాడు. ఆ వివాదం తనను, తన కుటుంబ సభ్యులను ఎంతో బాధకు గురి చేసిందన్నాడు. ఆ షోలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతో జుగుస్సుకరంగా ఉన్నాయన్నాడు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశానో తనకు ఇప్పటికీ అంతుబట్టడం లేదన్నాడు. అయితే ఈ వివాదంలో తన కుటుంబ సభ్యులు కూడా విమర్శలను ఎదుర్కొవడం చాలా బాధించిందన్నాడు. ఇక, ఈ షో తర్వాత తాను పూర్తిగా మారి పోయానన్నాడు. జీవితం ఎంటో ఆ తర్వాతే అర్థమైందన్నాడు. భవిష్యత్తులో మరెప్పుడూ ఇలాంటి పరిస్థితి రాకుండా తాను చూసుకుంటానన్నాడు.

ఈ వివాదం తర్వాత తన కుటుంబం ఎంతో మనో వేదనకు గురయిందన్నాడు. అయినా కుటుంబ సభ్యులందరూ తనకు అండగా నిలిచారన్నాడు. కానీ, తన వల్ల వారు కూడా దోషులుగా నిలబడడం మాత్రం ఎప్పుడూ బాధగానే ఉంటుందన్నాడు. ప్రస్తుతం తాను పూర్తిగా మారి పోయానన్నాడు. భవిష్యత్తులో తన వల్ల ఎవరికీ ఎటువంటి సమస్య రాకుండా చూస్తానన్నాడు. ఒక దశలో తన క్రికెట్ కెరీర్ ముగిసిందనే తాను భావించానని, చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని పేర్కొన్నాడు. ఇన్‌స్టా లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న హార్దిక్ ఈ విషయాలు వెల్లడించాడు.

Hardik opens up on Koffee with Karan Show controversy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News