Thursday, April 25, 2024

తండ్రి అయిన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య..

- Advertisement -
- Advertisement -

ముంబయి: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు ఫాదర్ గా ప్రమోషన్ వచ్చింది. గురువారం పాండ్యా ప్రేయసి నటాషా స్టాన్‌కోవిచ్‌ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పాండ్యా తొలిసారి తండ్రి అయ్యాడు. ఈ ఆనంద క్షణాలను పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం తల్లి, బిడ్ద ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలుపుతూ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో పాండ్య-నటషాలకు అభిమానులు, పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో నిశ్చితార్థం జరుపుకున్న పాండ్య, నటాషాలు సహజీవనంలో ఉన్నారు.

Hardik Pandya, Natasa blessed with baby boy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News