Friday, March 29, 2024

‘నాన్నే.. నా హీరో’: కంటతడి పెట్టిస్తున్న హార్దిక్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్లు కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్యలకు పితృవియోగం కలిగిన విషయం తెలిసిందే. వారి తండ్రి హిమాంశు శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. తండ్రి మరణం నేపథ్యంలో హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టు చేశాడు. ప్రేమతో తన తండ్రికి సందేశం ఇస్తున్న ఈ పోస్టు నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ‘నాన్న.. నా హీరో. మిమ్మల్ని కోల్పోవడం నా జీవితంలో అత్యంత కఠినమైన విషయం. కానీ మాకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చారు. మీరు ఎప్పుడూ మా జ్ఞాపకాలలో నవ్వుతూనే ఉంటారు. మేం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం.. మీరు, మీ శ్రమ,మీ నమ్మకమే. మీరు లేని ఇల్లు ఎంతో బోసిగా ఉంటుంది. మిమ్మల్ని మేం ఎంతో ప్రేమిస్తున్నాం, ప్రేమిస్తుంటాం. మీ పేరు ప్రతిష్ఠలను కాపాడుతాం. అయితే నేను ఒక్కటి నమ్ముతున్నా. ఇన్నేళ్లు మా గురించి ఆలోచించినట్లుగానే పైనుంచి కూడా మమ్మల్ని చూస్తూ ఉంటారని ఆశిస్తున్నా. మీరంటే మాకు గర్వకారణం. మీ జీవితాన్ని గడిపిన తీరు చూసి మేం గర్వపడుతుంటాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ప్రతి రోజూ మిమ్మల్ని మిస్ అవుతున్నా. లవ్ యు డాడీ!’ అని హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లోపోస్టు చేశాడు. కృనాల్, హార్దిక్‌లు అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదగడానికి హిమాంశు ఎంతో కష్టపడ్డారు.

Hardik Pandya Emotional tweet for his late father

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News