Friday, March 29, 2024

హార్దిక్‌కు చోటు ఖాయం

- Advertisement -
- Advertisement -

harbajan

 

ముంబై: గాయం వల్ల కొంతకాలం టీమిండియాకు దూరంగా ఉన్న యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు వరల్డ్‌కప్ జట్టులో చోటు ఖాయమని స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు. కరోనా వల్ల ప్రస్తుతం ఐపిఎల్ సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదన్నాడు. అయితే ఐపిఎల్ జరుగక పోయినా హార్దిక్ పాండ్యకు టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కుతుందనే నమ్మకాన్ని భజ్జీ వ్యక్తం చేశాడు. హార్దిక్‌లాంటి ఆల్‌రౌండర్ సేవలు భారత్‌కు చాలా అవసరమన్నాడు. బంతితో బ్యాట్‌తో సత్తా చాటే హార్దిక్‌ను ప్రపంచకప్ జట్టులో చోటు తప్పక ఉంటుందన్నాడు. అతన్ని తప్పించే సాహసం సెలెక్టర్లు చేస్తారని తాను భావించడం లేదన్నాడు. ఇక, కరోనా దెబ్బకు ఈసారి జరగడం కష్టంగా మారిందని, ఇది తనను ఎంతో బాధకు గురిచేసిందన్నాడు. మాములు పరిస్థితులు నెలకొనే వరకు ఐపిఎల్‌ను నిర్వహించక పోవడమే మంచిదని హర్భజన్ సూచించాడు.

 

Hardik Pandya to be part of World Cup squad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News