Home రాష్ట్ర వార్తలు కాంగ్రెస్‌పై మండిపడ్డ మంత్రి హరీశ్

కాంగ్రెస్‌పై మండిపడ్డ మంత్రి హరీశ్

hrsh

బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
మంచిని చూడలేక పోతున్నారని వ్యాఖ్య

భూపాలపల్లి /కాళేశ్వరం : తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించి, పనుల తీరుపై సంతృప్తి చెంది కితాబు ఇచ్చిన రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌పై మండిపడ్డ హరీశ్ రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి టీ. హరీష్ రావు మండిపడుతూ ఘాటుగా స్పందించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీకి సంబందించిన గ్రావిట్ కెనాల్ పనులు మొదటి దశనుండి చివరి వరకు కెనాల్ వెంటే వెళ్లుతూ క్షణ్ణంగా పరిశీలించి పనుల వివరాలను ,పురోగతిని అడిగి తెలుసుకుంటూ సూచనలు సలహాలు ఇస్తూ కాళేశ్వరం పంప్‌హౌజ్ వరకు పనులను పరిశీలించారు. తెలంగాణ ప్రజలను ,రైతులను దృష్టిలో పెట్టుకొని సాగు,త్రాగునీరుకు ఇబ్బందులు తలెత్తకుండా సస్యశ్యామలంగా మార్చాలనే సంకల్పంతో కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న ప్రాజెక్టులను మంత్రి హరిష్ రావు పనుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ త్వరగతిన పూర్తైయ్యేలా ప్రాజెక్టుల వద్దనే ఉంటూ వేగంగా పనులు జరిగేలా చూస్తూన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల ప్రాంతంలో హారిష్ రావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో ప్రాజెక్టులను నిర్మించకుండా ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తూ లూటీ చేశారని విమర్శించారు. ప్రభుత్వ నిభందన ప్రకారం డిజన్ల ఆధారంగా ఒక్కరూయాయి వృధా కాకుండా పనులు సక్రమంగా నడుస్తావుంటే,పనులను పరిశీలించిన సీడబ్యూసీ ,ఉన్నతస్థాయి అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ కేసిఆర్ ప్రభుత్వాన్ని పొగిడితే జీర్జించుకోలేని కాంగ్రెసోళ్లు విమర్శలు చేస్తా వున్నారని వారికి మంచి చూడడం కానీ…వినడం కానీ ఉండదని తెలిపారు. కర్ణాటక మంత్రి రేవంతన్న గొర్రెల పథకంపై,శాసనసభా పక్షనేత జాన రెడ్డి ఐదు రూపాయలకు భోజనం లాంటి పథకాలపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని అభినందిస్తే వారిపై హైకమెండ్‌కు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వ ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుతో ఈ ప్రాంత రైతాంగం,పంటలు సస్యశ్యామలంగా మారనున్నాయని,5జిల్లాల ప్రజలకు త్రాగునీరుకు ఏలాంటి ఇబ్బందులు ఉండవని పారిశ్రామిక అవసరాల సైతం ఉపయోగపడుతాయన్నారు. గోదావరి నుండి ఇసుక తరలింపుతో నీటిమట్టం పెరిగి మత్సకారులకు ఉపాథి కలుగుతుందని విద్యుత్ కు సైతం ఇబ్బంది ఉండదని మంత్రి హరిష్ రావు వెల్లడించారు. ఆయన వెంట మంథిని ఏమ్మేల్యే పుట్ట మధు,అధికారులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు