Home తాజా వార్తలు జిఎస్‌టి కౌన్సిల్‌లో ప్రస్తావిస్తా: హరీష్

జిఎస్‌టి కౌన్సిల్‌లో ప్రస్తావిస్తా: హరీష్

Harish Rao

 

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టిషనర్స్ అసొసియేషన్ ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావును కలిసి జిఎస్‌టికి సంబంధించిన అంశాలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈ నెల 20న గోవాలో జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అసొసియేషన్ అధ్యక్షులు నాగేశ్ రంగి, కార్యదర్శి విఠల్, ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్, శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి హుస్సేన్ వలి కార్యదర్శి నరేందర్ తదితరులు ఉన్నారు.

Harish promises to address GST Council meeting in Goa