Home జోగులాంబ గద్వాల్ చింతమడక ఏర్పాట్లలో హరీష్‌రావు

చింతమడక ఏర్పాట్లలో హరీష్‌రావు

Harish-Rao

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ సొంత గ్రామం చింతమడకకు కుటుంబసభ్యులతో కలిసి రానున్న నేపథ్యంలో స్థానిక శాసనసభ్యుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాక సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ పి. వెంకట్ రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్, జాయింట్ కలెక్టర్ పద్మాకర్‌లతో కలిసి దాదాపు మూడుగంటలపాటు గ్రామంలో పర్యటించారు. చింతమడకలోని ప్రతి కుటుంబానికి ఉపాధితో కూడిన ఆర్థికసహాయం అందించేందుకు ప్రత్యేకసర్వేలు చేస్తున్నట్లు ఈసందర్భంగా హరీష్‌రావు చెప్పారు. భూమి ఉన్న రైతులకు ఎలాంటి ఆదాయం లభిస్తుంది, ఇంకా ఆదాయం పెంపొందించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆంశాలపై హరీష్‌రావు నేరుగా ప్రజలతో సమావేశమయ్యారు.

అసైన్డ్ భూములు ఉన్న దళితరైతుల- భూములను పూర్తి స్థాయిలో సాగులోకి వచ్చేవిధంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గ్రామంలోని ప్రతిఒక్కరికి ఉపాధి కల్పించేందుకు సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామ సభ నిర్వహించేందుకు అనువైన స్థలం, హెలిప్యాడ్ ఏర్పాట్లను అధికారులతో కలిసి హరీష్‌రావు పరిశీలించారు. అలాగే ఐకెపి గోదాము, సిసి ప్లాట్‌ఫామ్‌ను పరిశీలించారు. అలాగే స్థానిక పెద్దమ్మ దేవాలయం సమీపంలో ఏర్పాటు చేయనున్న వనభోజనాలు, సిఎం కెసిఆర్ సహపంక్తి భోజనం చేసే స్థలాన్ని అధికారులతో కలిసి హరీష్‌రావు పరిశీలించారు. శివాలయాన్ని కెసిఆర్ దర్శించుకునేందుకు ఏర్పాట్లు, స్థానిక రామాలయ పనుల పరిశీలన చేశారు.

Harish Rao arrangements in Chintha Madaka