Home జిల్లాలు గుండె ధైర్యాన్ని కోల్పోవద్దు

గుండె ధైర్యాన్ని కోల్పోవద్దు

Untitled-1మెదక్ టౌన్ : గత కాంగ్రెస్, టిడిపి ప్రభు త్వాల పాలన ఫలితమే అన్నదాతల ఆత్మహ త్యలని భారీ నీటిపా రుదల, మార్కెటింగ్, గనుల, భూగర్భశాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు అన్నారు. మెదక్‌లోని సాయిబాలా జీ గార్డెన్‌లో శనివారం రైతుల ఆత్మహత్యల కు టుంబాల పరామర్శ, తీవ్రవాదుల చేతుల్లో మరణించిన కుటుంబాలకు పరిహారం, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పా ల్గొన్న మంత్రి రైతుల కుటుంబాలతో ఒక్కొ క్కరిగా వారి బాధలను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సివచ్చిందో తెలుసుకున్నారు. వారికి కావాల్సిన సహాయం ఆర్థిక చేయూత పథకాలను అక్కడికక్కడే మంజూ రు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌తో కలిసి సా మూహిక భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ గుండె ధైర్యాన్ని కోల్పోవద్దని మీకు అండగా నిలబడి మిమ్మల్ని కా పాడుకునే బాధ్యత మాదేనని భరోసా ఇచ్చారు. రైతు ఆత్మహత్యలకు ముఖ్య కారణం సాగునీరు అందకపోవడం, పంట నష్టపోవడం ఫలి తంగానే ఏర్పడిన అప్పుల బాధలని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు సాగునీరందించాలని నిర్ణయించిందని రాబోయే నాలుగు సంవ త్సరాల్లో రూ. లక్ష కోట్లు కేటాయించి, కోటి ఎకరాలకు కాలువ నీటి ద్వారా సాగులోకి తేవాలని నిర్ణయించామన్నారు. మెదక్ జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు సాగు నీరం దించేందుకు పాములపర్తి రిజర్వాయర్‌ను నిర్మిస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి సింగూరు ప్రాజె క్టు ద్వారా జోగిపేట పరిధిలో 40 వేల ఎకరాలకు నీరందిస్తామన్నారు. ఘనపూర్ ఆనకట్ట పనులు త్వరలో పూర్తి చేసి చిట్టచివర ఎకరాలకు కూడా నీరందిస్తామన్నారు. రాష్ట్రంలో రూ. 1024 కోట్లతో 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థం గల గోదాములు నిర్మిస్తామన్నారు. తెలంగా ణ రాష్ట్రంలో కొత్తగా 33 మార్కెట్ యార్డులను ఏ ర్పాటు చేస్తామని అందులో మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మార్కెట్ యార్డు కూడా కలదన్నారు.

రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను పగటి పూట నాణ్యమైన కరెంటును అందిస్తామ న్నారు. లో ఓల్టెజ్, హెచ్చుతగ్గుల కరెంటు సరఫరాను నిరోధించేందుకు ఒక్క మెదక్ నియోజకవ ర్గంలోనే వెయ్యి ట్రాన్స్‌ఫార్మర్లను బిగించడం జరిగిందన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలబడుతుం దని విలువైన ప్రాణాలను పోగొట్టుకోకూడదని, కొండంత ధైర్యంతో, వి శ్వాసంతో జీవించాలని సూచించారు. రైతుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వారికి వృద్ధాప్య, వితంతు పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, 35 కిలోల అంత్యోదయ కార్డు, ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు మంజూరు చేస్తామ న్నారు. వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో 5 వ తరగతి వరకు ఉచితంగా చదివిస్తామని, తదనంతరం ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి చదివిస్తామని తెలిపారు. మహిళ లకు స్త్రీనిధి కింద పాడి పశువులు అందజేస్తామని, వ్యవసాయం చేయద ల్చే వారికి విత్తనాలు, ఇతర సహాయం అందిస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న 13 మంది రైతు కుటుంబాలకు కావాల్సిన సహాయం 15 రోజుల్లో అందాలని అందుకు రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యా, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ అధికారులకు బాధ్యత తీసుకుంటారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే పరామర్శించాల్సింది పోయి, చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తున్నారన్నారు. వ్యవసా యం దండగ అన్న చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు.

రానున్న రోజుల్లో కాల్వ కింద నీళ్లు తీసుకువచ్చి రైతులు కాలుమీద కాలువేసుకుని వ్యవసాయం చేసుకునే రోజులు తీసుకువ స్తామన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రామాయంపేట మండలంలో ఆత్మహత్యకు పాల్పడిన ఓ బా ధిత రైతు కుటుంబీకులతో హరీశ్‌రావు వారి బాధలను తెలుసుకుంటున్న తరుణంలో తమకు మం జూరైన చెక్కు ఒకటి మాత్రమే డబ్బులు డ్రా అయ్యా యని తెలుపగా, సదరు మండల తహసీల్దార్‌ను వారి సమస్యల పట్ల స్పం దించకపో వడంపై ఎందుకు నిర్లక్షంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. మరోసారి రైతుల పట్ల ఇష్టారీతిగా ప్రవర్తిస్తే సస్పెండ్ కావాల్సి వస్తుందని రామాయంపేట తహసీల్దార్‌ను హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదే వేందర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒక్కొక్కరికి రూ. లక్షన్నర సహాయం అందించడం జరిగిందన్నారు. అ లాగే జిల్లాలో నక్సలైట్ల చేతుల్లో మరణించిన 38 మంది కు టుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ. 1.90 కోట్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 75 మందికి రూ. 33.98 లక్షలు పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ మాట్లాడుతూ జీవితం చాలా విలువైంద ని, పిరికి తనంతో ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. పోరాడి గెలవాలే తప్ప ప్రాణాలను తీసుకోవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, వ్యవసాయ జెడి, ఆర్‌డిఒ మెంచు నగేష్‌గౌడ్, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.