Thursday, April 25, 2024

నై కిసాన్ అనే నినాదంతో బిజెపి పాలిస్తోంది: హరీష్ రావు

- Advertisement -
Harish rao comments on BJP Govt
సిద్దిపేట: గతంలో నీటికి, కరెంట్ కి ఇబ్బంది ఉంటే ఇప్పుడు తెలంగాణలో పొలాల్లో గోదావరి నీరు ప్రవహిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నాలో హరీష్ రావు ప్రసంగించారు. కొత్త విద్యుత్ విధానం బిజెపి తెచ్చిందని, పక్క రాష్టంలో ముఖ్యమంత్రి పొలాల్లో మీటర్ పెడితే, మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పంట పొలాల్లో విద్యుత్ మీటర్లు పెట్టం అని పోరాడుతున్నారన్నారు. బిజెపి గవర్నర్లే ఈ నల్ల చట్టాలు తొలగించాలి అని చెబుతున్నారని, ఒక్కపుడు జై కిసాన్ అనే నినాదం ఉండేదని, కానీ నై కిసాన్ అనే నినాదంతో బిజెపి పాలిస్తోందని మండిపడ్డారు. కేంద్ర బిజెపి నాయకులు దొడ్డు బియ్యం కొనం అంటే.. రాష్ట్ర బిజెపి నాయకులు కొంటాం అని ఆటలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఒకప్పుడు రైతులు కరెంట్ కోసం ఎదురు చూస్తే ఇప్పుడు రైతులు 24 గంటల కరెంటా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. వడ్లు కొనం అని చేతులు ఎత్తిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బిజెపి పార్టీ అని, వడ్లు కొని రైతుల పక్షాన నిలబడండి అని డిమాండ్ చేస్తున్నామని, లేక పోతే కమలం పువ్వు వాడిపోతదని హెచ్చరించారు.
రైతులను ఉగ్రవాదులుతో బిజెపి పొలుస్తుందని, ఒక వర్గానికి చెందిన వాళ్ళను దేశ భక్తులుగా ప్రచారం చేస్తోందన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలు వద్దు, దొడ్డు వడ్లు కొనండి, గ్యాస్ ధర తగ్గించండి అని అడిగితే దేశ ద్రోహిగా బిజెపి సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 70 సంవత్సరాల నుంచి ఉన్న దొడ్డు వడ్ల కొనుగోలును కొనసాగించండి అని అడుగుతున్నామని కొత్త కొరికలు అడుగుతలేమన్నారు.
తెలంగాణ రైతులు దేశ ప్రధానికి ట్వీటర్ లో సందేశాలు పంపించాలని పిలుపునిచ్చారు. దొడ్డు వడ్లను కొనండని  ప్రధాని మోడీకి మొరపెడితే మారుతారేమో చూద్దామన్నారు.
గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నా పార్టీలు అన్ని దొడ్డు వడ్లు కొన్నాయని, ఇప్పుడు ఎందుకు కొనడం లేదని నిలదీశారు. బిజెపి బెదిరింపులకు తెలంగాణ రైతులు భయపడే వాళ్ళు కాదని, రేపు ఢిల్లీలో కూడా ఎంపిలు నిరసన ప్రదర్శనలు చేపడతారన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, యాసంగిలో వడ్లు కొనక పోతే ఇలాంటి ధర్నాలు, ఉద్యమాలు ఇంకా చాలా చేస్తామని హెచ్చరించారు. కేంద్ర చేయాలిసిన పని దొడ్డు వడ్లు కొనే పని అని, ఆ పని చేయకుండా చేతులు ఎత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా వ్యాపారులకు ఎన్నో కోట్ల రూపాయలు మాఫీ చేశారని,  రైతుల మీద బిజెపి ఎందుకు చిన్న చూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలను చేశామని, ఈ దొడ్డు వడ్లు కొనే దాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు. బిజెపి సోషల్ మీడియా ఓ కాలేజీని స్థాపించి, తప్పుడు ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News