Home తాజా వార్తలు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన హరీశ్ రావు

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన హరీశ్ రావు

Harish Raoసిద్ధిపేట : తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేద మహిళల జీవితాల్లో పండుగపూట  వెలుగు నింపేందుకే బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. బతుకమ్మను మహిళలు ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మహిళల అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. సిద్ధిపేట జిల్లాలో 3 లక్షల 65 వేలకు పైగా బతుకమ్మచీరలను పంపిణీ చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Harish Rao Distributed Bathukamma Sarees