Home తాజా వార్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డివి పచ్చి అబద్ధాలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డివి పచ్చి అబద్ధాలు

Harish rao election campaign for huzurabad by poll

 

కరీంనగర్ : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పాల్సింది పోయి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధ్దాలు ఆడుతున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం హుజురాబాద్ నియోజకవర్గంలోని చల్లూరు, సిరిసెడు, వీణవంక గ్రామాలతో పాటు పలు చోట్ల తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బిజెపి వాళ్లు అన్ని మొండి మాటలు.. తొండి మాటలు చెప్పుతూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఒకే నెలలో 18 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన ఘనత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి దక్కిందన్నారు. క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏడేళ్లలో కేంద్ర పన్నులు 4 రూపాయల నుంచి.. 32 రూపాయలకు పెంచిన ఘనత బిజెపికే దక్కుతుందిపెట్రోల్, డీజిల్ తో రైతులపై భారం పడటం లేదా? ఓ కేంద్ర మంత్రి పెట్రోల్, డీజిల్ ధరలతో 90 శాతం మంది ప్రజలకు సంబంధం లేదని అంటున్నాడు.. డీజిల్, పెట్రోల్ అవసరం లేని మనిషి ఉన్నాడా? కేంద్రమంత్రులు, బిజెపి నాయకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు.

బిజెపి గ్యాస్ ధరను రూ.500 నుంచి వెయ్యి రూపాయలకు పెంచి సబ్సిడీని పూర్తిగా ఎగగొట్టింది నిజం కాదా.. చెప్పండి అని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ పై రూ.291 రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధిస్తుందన్న ఈటెల మాటలకు.. అదే నిజమైతే ఆర్థిక మంత్రిగా పదవికి రాజీనామా చేస్తానని చాలెంజ్ చేస్తే పది రోజులైనా పత్తా లేడు.. గ్యాస్ సిలిండర్ పై మరో రూ. 200 పెంచేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. త్వరలో కేంద్రం గ్యాస్ సిలిండర్ ధర నవంబర్ 2న రూ. 1,250 చేయబోతుందని మరో ఏడాది అయితే రూ.2 వేలు అవుతుందని, పేద ప్రజలపై ప్రేమ ఉంటే 500 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిజెపికి ఓటు వేయడం అంటే మన వేలితో మనమే కన్ను పొడుచుకున్నట్టే అని అన్నారు. కెసిఆర్ కిట్ లో కేంద్రం రూ. 5 వేలు ఇస్తుందని ఈటెల అంటున్నారు.. బిజెపి ఇచ్చినట్లయితే వేరే రాష్ట్రంలో ఆ పథకం ఎందుకు లేదో చెపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినా.. ఇంకా ఓటేస్తామా? చెప్పండి..! ఈటెలది నోరా.. మోరా? పూటకో మాట మాట్లాడుతున్న ఈటల రాజేందర్ ను ఏ రకంగా విశ్వసించాలి అన్నారు. ఉత్తరప్రదేశ్ లో వడ్లు కొనకుంటే రోడ్లపై పోసి తగల పెడుతున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో వడ్ల కొనడం లేదు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటుందా.. లేదా ఆలోచించాలని మంత్రి హరీష్ రావు హుజురాబాద్ నియోజవర్గ ప్రజలను కోరారు.

మంత్రిగా ఉండి ఈటెల హైదరాబాద్ లో మెడికల్ కాలేజీ కట్టాడు కానీ.. పేద విద్యార్థుల కోసం ఒక డిగ్రీ కాలేజీ తేలేకపోయాడు అన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు మంత్రిగా పని చేసి కనీసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చాడా?యువకుల కష్టాలు యువకుడికే తెలుస్తాయి.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండిపేదవాళ్లకు, ఉద్యమకారులకు అవకాశం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తోటి విద్యార్థులుగా గెల్లు శ్రీనుకు మీరంతా అండగా ఉండాలి…ఈటల రాజేందర్ గెలిస్తే అక్కడ చేతులు కట్టుకుని నిలబడాలి.. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే దోస్తులాగా యువకుల్లో యువకుడిగా కలవచ్చు ఢిల్లీ వాళ్ళు కావాలా.. గల్లీలో ఉండి పని చేసే వాళ్ళు కావాలా తేల్చుకోవా అన్నారు. చల్లూరు సీతారామస్వామి సాక్షిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే.. 3 నెలల్లో మండలంగా చేస్తాం.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిపించుకుందాం….చల్లూరు మండలంగా సాధించుకుందాం మెదక్ లో చెల్లని రూపాయి వీణవంకలో చెల్లుతదా నా పుణ్యాన విజయశాంతి ఎంపీగా గెలిచిందని అన్నారు.ఈ ఎన్నిలక ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వివేకానంద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పాడి కౌశిక్ రెడ్డి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Harish rao election campaign for huzurabad by poll