Home కరీంనగర్ గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి… బిజెపిని బొంద పెట్టండి: హరీష్ రావు

గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి… బిజెపిని బొంద పెట్టండి: హరీష్ రావు

Harish rao fire on BJP

కరీంనగర్: కరెంట్ గతంలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బావుల గడ్డల మీద, పొలం గట్ల మీద రైతులు పడుకునేవాళ్ళు అని, కానీ నేడు 24 గంటల కరెంటు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వమని ప్రశంసించారు. కానీ ఈటల రాజేందర్, బిజెపి ప్రభుత్వం ఏమిచ్చారు? బొందపెడుతా కూలగొడుతా కాలవెడుతా అంతూ చూస్తా  గోరీ కడుతా అని అన్నాడే తప్ప, నిరుపేదలకు ఏమైనా చేస్తా అని చెప్పారా? అని ప్రజలను అడిగారు.  టిఆర్ఎస్ వాళ్ళను తిట్టడం తప్ప మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి రాజేందర్ చెప్పింది ఏమి లేదని,  స్వార్థం కోసం బిజెపిలో  చేరావని మండిపడ్డారు. బిజెపి గ్యాస్ సిలిండర్ ధర రూ. 1050 చేసిందని, ఓట్లు అయిపోయిన తర్వాత రూ. 200 ఒకేసారి పెంచుతారని, సబ్సిడీ మాత్రం తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి గ్రామానికి మహిళా భవనానికి రూ. 15 లక్షలు, మహిళా సంఘాలకు రుణాలు చెక్కులు ఇచ్చామని, రోడ్లకు నిధులు ఇచ్చామని, తాము పనిచేశామని టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయమని అడుగుతున్నామన్నారు.  ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారని, సిలిండర్ ధర తగ్గించాలని అడిగామని, సబ్సిడీ రూ. 250 ఇవ్వాలని అడిగామని, ఉత్త చేతులు, గాలి మాటలు తప్ప పేదలకు ఏం చేస్తారో చెప్పలేదని నిలదీశారు.

బీహార్ రాష్ట్రానికి చెందిన డోలా కుమారికి ప్రధాని మోడీ ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చారని, గ్యాస్ సిలిండర్ 400 నుండి వెయ్యి దాటడంతో ఆమె సిలిండర్ అటక ఎక్కించిందని, పొయ్యిల కట్టెలు వాడుతోందని, ఏడాది తరువాత సిలిండర్ రూ. రెండు వేలు దాటుతుందని, ఇందుకు బిజెపికి ఓటు వేద్దామా? అని హరీష్ రావు అడిగారు.  ఇక సిలిండర్ ధర పెంచమని చెప్పండి అని బిజెపి నాయకులను అడిగామని, అదికూడా వారు చెప్పడం లేదన్నారు.

30 వ తారీకు రోజు ఓటు వేసే ముందు మహిళలు వంట గదిలోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి కారు గుర్తుకు ఓటు వేసి బిజెపిని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ఆలాగైతేనే గ్యాస్ ధర తగ్గుతుందన్నారు.  పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారని, ఒక ఎకరం దూన్నెందుకు రూ. 2500 అయ్యేది. కానీ నేడు.. రూ. 6 వేలు అవుతోందని, డీజిల్ ధర పెరగడమే దీనికి కారణమని కెసిఆర్ రైతుబంధు రైతు కుడి చేతికి ఇస్తుంటే ఎడమ చేతితో బిజెపి తీసుకుంటోందని వివర్శించారు. మంచినూనె రూ 200 అయిందని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు.

రాజేందర్ కు ఎం చెప్పాలో తెలియడం లేదని, అందుకే టిఆర్ఎస్ తిడుతున్నాడని,  బిజెపి- కాంగ్రెస్ తెలంగాణాలో అధికారం లోకి వచ్చేది లేదన్నారు. రాజేందర్ రాక ముందు టిఆర్ఎస్ గెలిచిందని, రాజేందర్ పోయిన తర్వాత కూడా గెలిచేది టిఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండని, ఇంటి అడుగు జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల 4 వేలు మంజూరు చేస్తామని., రాజేందర్ మంత్రి గా ఉంది ఒక్క ఇంటిని కూడా నిరుపేదల కోసం నిర్మించి ఇవ్వలేక పోయారని దుయ్యబట్టారు. ఇంకా రెండేళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని, దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే వస్తాయా? అని అడిగారు. బిజెపి ప్రభుత్వం వచ్చేది లేదని, ఏమి ఇచ్చేది కూడా లేదని, వాళ్ళు జూట మాటలు, తొండి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిజెపి నాయకులూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, గ్యాస్ లో రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఉందని చెబుతున్నారని, రైతులు ఇష్టం వచ్చిన పంటలు వేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఏదైనా వేసుకోవచ్చని దీనిపై బిజెపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామన్నారు.

ఎవరో దాడులు చేసినట్టు సృష్టించి సానుభూతి పొందే ప్రయత్నం ఈటల రాజేందర్, బీజేపీ చేస్తోందన్నారు. వాటిని నమ్మకండని, సోషల్ మీడియాలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేయాలనీ చూస్తున్నారని, బిజెపి నాయకులు వీటిని నమ్మొద్దని హుజురాబాద్ ప్రజలు లాభపడాలన్నారు. మండలంలో బిజిగిరి షరీఫ్ లో ఎక్కువ మెజారిటీ గెల్లు శ్రీనివాస్ కు ఇవ్వాలని కోటి రూపాయలు అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. గెల్లు గెలుపు ఖాయమైందని, మెజారిటీనే ఎక్కువ రావాలన్నారు. ఇల్లందకుంట రామాలయానికి రూ. 10 కోట్లు, బిజిగిరి షరీఫ్ కు రూ. కోటి రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తామన్నారు.