Friday, April 26, 2024

ఢిల్లీకి వస్తే రాష్ట్రమంత్రులను అవమానిస్తారా?: హరీశ్ రావు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రమంత్రి పియూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు విషయంపై కేంద్రాన్ని స్పష్టత కోరేందుకు తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్రమంత్రులు ఢిల్లీకి వెళ్లితే కేంద్రమంత్రి అవమానిస్తారా? అని మంత్రి హరీశ్ మండిపడ్డారు. బుధవారం మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ”రాష్ట్రమంత్రులు రైతుల పక్షాన ఢిల్లీకి వెళ్లారు. పియూష్ గోయల్ అభ్యంతరకరం వ్యాఖ్యలు చేశారు. ఆయన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. రాజకీయం చేస్తున్నది మీరే. మంత్రులను కలిసేందుకు సమయంలేదు కానీ, బిజెపి నేతలను మాత్రం కలుస్తారా?. మంత్రులను పట్టుకుని పనిలేదంటారా. ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు రైతులు ఢిల్లీకి వస్తారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడే నైతికత మీకు ఎక్కడిది. ఇంతకన్న హేయం ఏమైనా ఉంటుందా?. మీకు రాజకీయాలు ముఖ్యమేమో మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి మధ్యలోనే వదిలేసింది బిజెపి. రాష్ట్రం నుంచి అధికారిక బృందం వస్తే కలవకుండా రాజకీయం చేసింది మీరే. పంజాబ్ లో కొంటున్నట్లుగానే తెలంగాణలోనూ మొత్తం వడ్లు కొనమని అడిగాం. దానికి డొంకతిరుగుడు సమాధానం చెబుతున్నారు. దేశమంతా ఒకే పద్ధతి ఉండాలని మేం అడుగుతున్నాం. మీకు అవసరమున్నప్పుడు మెడమీద కత్తిపెట్టి తీసుకున్నారు కదా. రైతులకు అవసరం ఉన్నప్పుడు తీసకోమంటే తీసుకోరా?. 70 లక్షల మంది తరుపున అధికారిక బృందం వస్తే అవమాన పరుస్తారా” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao fires on Union Minister Piyush Goyal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News