Home తాజా వార్తలు సంగమేశ్వర ఇరిగేషన్ ప్రాజెక్ట్ సర్వేని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

సంగమేశ్వర ఇరిగేషన్ ప్రాజెక్ట్ సర్వేని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

Harish rao inaugurates survey of sangameshwara project

 

జహీరాబాద్/మునిపల్లి : జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం వెంకటపూర్, మునిపల్లి మండలంలోని లింగంపల్లి గ్రామల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారి చేతుల మీదుగా సంగమేశ్వర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం సర్వే పనులను ప్రారంభించారు. అనంతరం ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు దృష్ట్యా సాగునీటి ప్రాజెక్టుల కోసం కొన్ని వెయిల కోట్ల రూపాయలు వెచ్చించి కోటి ఎకరాల ఆయకట్టు కోసం తీవ్రంగా కృషి చేస్తుందని అన్నారు. నేడు జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజక వర్గలకు సుమారు 2.19 లక్షల ఎకరాల నీటి పారుదల కోసమే సంగమేశ్వర ప్రాజెక్ట్ నిర్మిస్తూన్నామని, నేడు సర్వే పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు.

త్వరలో సర్వే పనులు ముగించి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మండలి ప్రోటెం చైర్మెన్ భూపాల్ రెడ్డి, జిల్లా చైర్‌పర్సన్ మంజు జైపాల్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు బి బి పాటిల్, పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, పఠాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మాజీ మంత్రి మొహమ్మద్ ఫరీదుద్దీన్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డిసియంస్ చైర్మెన్ శివ కుమార్, ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు, సర్పంచులు, పిఏసిఎస్ చైర్మైన్ లు, డైరెక్టర్లు, సింగల్ విండో చైర్మన్ లు, ఉపసర్పంచులు, మండలాల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీల అధ్యక్షులు, సంగారెడ్డి జిల్లాకు చెందిన వివిధ నాయకులు కూడా పాల్గొన్నారు.

Harish rao inaugurates survey of sangameshwara lift irrigation project