Friday, April 19, 2024

డయాగ్నొస్టిక్ సెంటర్లలో వేగంగా, నాణ్యమైన పరీక్షలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao inauguration Telangana diagnostic center

సంగారెడ్డి: డయాగ్నొస్టిక్ సెంటర్లలో వేగంగా, నాణ్యమైన పరీక్షలు, ఫలితాలు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్ష కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డిలో డయాగ్నొస్టిక్ సెంటర్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సిఎంకెసిఆర్ ఆదేశాల మేరకు డయాగ్నొస్టిక్ కేంద్రాలు ప్రారంభమయ్యాయన్నారు. ఈ సందర్భంగా హరీస్ మాట్లాడారు. రూ.2.50 కోట్లతో డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశామని, సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. సిఎం కెసిఆర్ సహకారంతో సంగారెడ్డి ప్రజల కల నెరవేరిందని, సంగారెడ్డిని విద్యాక్షేత్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దిందన్నారు. డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో 57 రకాల వైద్య పరీక్షలు చేశామని, కరోనా టెస్టుతో సహా రక్త, మూత్ర, బిపి, షుగర్, గుండె జబ్బు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి పలు పరీక్షలు చేయనున్నారు. అత్యంత అరుదుగా చేసే ప్రత్యేక పరీక్షలు కూడా ఉచితంగా చేయనున్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News