Friday, March 29, 2024

గజ్వేల్ ఆస్పత్రిని తనిఖీ చేసిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

గజ్వేల్: కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవల పట్ల ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.    ఈ ఆస్పత్రిలో నెలకు 400 డెలవరీలు చేస్తున్నామని, ఒక రూపాయి ఖర్చు లేకుండా కెసిఆర్ కిట్ ద్వారా అందజేస్తున్నామని, ప్రభుత్వాస్పత్రిలో కాన్పుల సంఖ్య 22 శాతం పెంచామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎస్ఎన్ సియు వార్డు ఏర్పాటు చేసి కామెర్లు వచ్చిన చిన్న పిల్లలకు చికిత్స అందిస్తున్నామన్నారు. గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది సేవలను కొనియాడారు. ఆడపిల్ల జన్మిస్తే 13 వేలు, మగపిల్ల జన్మిస్తే 12 వేల రూపాయలు కెసిఆర్ కిట్ ద్వారా ఇస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News