Saturday, April 20, 2024

గెల్లు గెలుపు హుజూరాబాద్ అభివృద్దికి మలుపు: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు హుజూరాబాద్ అభివృద్దికి మలుపు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం వీణవంక, నర్సింగాపూర్ కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వంద మంది యువకులు మంత్రి హరీశ్ సమక్షంలో తెరాసలో‌ చేరారు. వీరికి మంత్రి హరీశ్ రావు గులాబీ‌ కండువా‌ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో‌ తెరాసకే తమ మద్దతు అని యవత మంత్రికి చప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ లో బీజేపీ గెలిస్తే లాభం ఏంటని.. బండి సంజయ్ ఎంపిగా గెలిచి రెండున్నరేళ్లు అయింది, వీణవంకలో పది లక్షల పని ఏదైనా చేశారా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ కోసం ఢిల్లీ వెళ్లి ఐదు వేల కోట్ల‌ప్యాకేజీ‌ తీసుకొచ్చి ఓట్లు అడగాలన్నారు. ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు, బిజెపి పార్టీకి‌ లాభం.. కానీ, గెల్లు శ్రీను గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు లాభమని చెప్పారు. పని చేస్తే కుట్టుమిషన్లు, గడియారాలు, కుక్కర్లు పంచడమెందుకని ప్రశ్నించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చి‌ఏడేళ్లలో‌ చేసిందేంటని, నోట్లు‌రద్దు చేసి అవినీతి‌ ధనం ఎంత బయటపడ్డదో‌ లెక్కలు‌ చెప్పారా? అని ప్రశ్నించారు. విదేశాల నుండి నల్లధనం తెప్పించి, ఒక్కోరి అక్కౌంట్ లో‌ 15 లక్షల రూపాయలు వెస్తామన్నారు.. ఒక్క రూపాయి అయినా వేశారా? అని మండిపడ్డారు. డీజీల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు తప్ప‌ఆ పార్టీ చేసిందేమి లేదన్నారు. ఏడేళ్లలో తెరాస‌ చేసిందేమిటో లెక్కలు మొత్తం మొన్ననే చెప్పానన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే వివిధ రంగాల్లో తెలంగాణ దేశంలోనే‌ నెంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు. గెల్లును గెలిపిద్దాం.. అభివృద్ధి ప్రదాత‌ సీఎం కేసీఆర్ చేతులను బలపరుద్దాం అని ప్రజలకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Harish Rao invites Youth into TRS at Veenavanka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News