Monday, June 23, 2025

ముగిసిన కాళేశ్వరం విచారణ.. కెసిఆర్‌తో హరీష్ రావు భేటీ

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం విచారణ ముగిసిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు.. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను కలిశారు. కొద్దిసేపటిక్రితమే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న హరీష్ రావు..కేసిఆర్‌తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఈరోజు కమిషన్ ముందు విచారణకు హరీశ్ రావు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై హరీష్ రావును జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. దాదాపు 45 నిమిషాల పాటు హరీష్ రావును కమిషన్ విచారించింది. ఆ తర్వాత బయటకు వచ్చిన హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ఆధారాలను కమిషన్ కు సమర్పించానని తెలిపారు. అక్కడ నుంచి నేరుగా హరీషరావు.. కెసిఆర్ దగ్గరికి వెళ్లారు.  కాగా, ఈనెల 11న కెసిఆర్ కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News