Home తాజా వార్తలు 16నుంచి 50వేల లోపు రైతుల రుణాలు మాఫీ..

16నుంచి 50వేల లోపు రైతుల రుణాలు మాఫీ..

Kharif-Season

హైదరాబాద్: ఆగస్టు 16వ తేదీ నుంచి 50వేల లోపు రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. శుక్రవారం బీఆర్కే భవన్ లో బ్యాంక్ అధికారులతో మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 42 బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. 50వేల లోపు రుణాలు తీసుకున్న ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి 2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ కానున్నాయి. బ్యాంకర్లు రుణ మాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయవద్దని, పూర్తిగా రుణా మాఫీ రైతుల ఖాతాలోనే జమ చేయాలని బ్యాక్ అధికారులను మంత్రులు ఆదేశించారు. రుణ మాఫీ జరిగిన రైతుల అక్కౌంట్లు జీరో చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని చెప్పారు.

Harish Rao meeting with Bank Officials