Home తాజా వార్తలు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి : హరీశ్ రావు

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి : హరీశ్ రావు

Harish Rao Planted Seed Balls At Siddipet Forestసిద్దిపేట : విధిగా ప్రతిఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మొక్కలు నాటి అడవులను సృష్టించడం ద్వారా స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చని ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఆక్సిజన్ కొంటున్నారని, ఆ పరిస్థితి తెలంగాణ ప్రజలకు రావొద్దని ఆయన చెప్పారు. ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ కు రూ.700 వేలు అవుతుందని, జీవిత కాలంలో ఆక్సిజన్ కొంటే రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తే ఆక్సిజన్ కొరత రాదని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా అడవుల్లో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం హరీశ్ రావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప‌ద్మ‌శ్రీ వనజీవి రామయ్య, ఆయన సతీమణి తదితరులు పాల్గొన్నారు.