Thursday, March 28, 2024

సిలిండర్ చూసి ఓటెయ్యండి

- Advertisement -
- Advertisement -

నాంపల్లి రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/నాంపల్లి/ యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బలపర్చిన టిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే.. నల్లాల ద్వారా ఇంటింటికీ నీళ్లు ఎలా ఇచ్చామో, పంట పొలాలకు కాలువల ద్వారా కూడా అలాగే నీళ్లందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి చివరి రోజు కావడంతో మంత్రి హరీష్‌రావు మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేతపై జిఎస్‌టి విషయంలో బిజెపి నేతలు చాలా మాట్లాడారని అన్నారు. తాను హైదరాబాద్‌లో రుజువులతో సహా అన్ని మాట్లాడితే బండి సంజయ్, కిషన్ రెడ్డి తలదించుకున్నారని వివరించారు. తెలంగాణ చేనేతపై జిఎస్‌టిని వ్యతిరేకించిందని చెబితే కిక్కురమనట్లేదని అన్నారు. అక్కా,చెళ్లెల్లంతా ఇంటి ముందు నల్లాలను చూసి, వంట రూంలో గ్యాస్ సిలిండర్ చూసి… కసికసిగా ఓట్లు వేయాలని సూచించారు. గురువారం ఉదయం మహిళలంతా ఉదయం గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి పోలింగ్‌కు వెళ్లాలన్నారు.

మునుగోడులో ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బిజెపి పార్టీతో మాట్లాడుకుని 18 వేల కోట్ల కాంట్రాక్టు తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు. ఇది స్వయంగా రాజగోపాల్ రెడ్డి చెప్పుకున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆరు నెలల కింద తనకు కాంట్రాక్ట్ ఇచ్చారని, అందుకే బిజెపి వాళ్లను సంతోష పెట్టేందుకు రాజీనామా చేశాడంటూ విమర్శలు గుప్పించారు. ఆయన ఎమ్మెల్యేగాఉన్న నాలుగు సంవత్సరాల కాలం లో కనీసం మునుగోడు మహిళలు కూర్చోవడానికి మహిళా సంఘ భవనాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి కట్టించలేదని ఎద్దేవా చేశారు. ఆసరా పింఛ న్లు, కల్యాణ లక్ష్మీ, 24 గంటల కరెంటు, రైతు బం ధు, కెసిఆర్ కిట్ వంటి పథకాలను తీసుకొచ్చి పేద ప్రజలకు నేడు టిఆర్‌ఎస్ కెసిఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందని వివరించారు. మరి బిజెపి ప్రభుత్వం మునుగోడు ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రూ. 400 గ్యాస్ బండ ధరను 1200 చేసిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News