Thursday, April 18, 2024

పట్టణ, పల్లె ప్రగతిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: హరీష్

- Advertisement -
సిద్దిపేట: అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లే కాదు అని పట్టణ, పల్లె ప్రగతి కూడా ఒక భాగమే. 4 ఏళ్ల నుంచి డయేరియా, సీజనల్ వ్యాధులు లేవని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. నాల్గవ విడతపల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సన్నాహాక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు.
పట్టణ, పల్లె ప్రగతి పనులపై అంశాల వారీగా అధికారులకు దిశానిర్ధేశం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రాధాన్యత పనులు చేపట్టాలని సూచించారు. ఏ రాష్ట్రంలో కూడా పల్లె, పట్టణాల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమం అమలు కావడం లేదన్నారు.  పల్లె, పట్టణ ప్రగతి ముగిసిన 10 రోజుల తర్వాత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తామని లోటుపాట్లు ఉంటే ముందే సవరణలు చేసుకునేలా బాధ్యతలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మండలానికో బృహత్ పల్లె ప్రకృతి వనం 10 రోజుల్లో ప్రారంభించాలని, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు 80 ట్రాక్టర్లు ఉండేవి. కానీ ఇవాళ రాష్ట్రంలో 12 వేల 769 గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాoకర్లు ఉన్నాయని తెలియజేశారు. రాష్ట్రంలో 12 వేల 769 గ్రామ పంచాయతీలకు గానూ 19 వేల 298 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, అదనంగా పలు గ్రామాల్లో రెండు చొప్పున 7 వేల పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. దేశంలో ఏ పల్లెకు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెకు నర్సరీ, డంప్ యార్డు, వైకుంఠ ధామాలు ఉన్నాయని,  తూతూ మంత్రంగా పని చేయొద్దని, సెలవులు పెట్టొద్దని, యుద్ధప్రాతిపదికన పల్లె, పట్టణ ప్రగతి సాధనలో ఆదర్శంగా నిలిచేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు.
గ్రామాల్లో, పట్టణాల్లో పల్లె, పట్టణ ప్రగతి నిరంతరం కొనసాగాలని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి తెలియజేశారు. ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాలని, హరితహారంలో నాటిన మొక్కలతో రోడ్లకు ఇరువైపుల చెట్లు స్వాగతం పలుకుతున్నట్లు ఉండాలన్నారు.  విద్యుత్ లైన్ లు, పోల్ షిఫ్టింగ్ వంటి పెండింగ్ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి నెల గ్రామానికి, మున్సిపాలిటీకి నిధులు అందిస్తున్నామని, సమస్యలకు పరిష్కారం వెంటనే చూపాలని అధికారులను ఆదేశించామని, దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ పంచాయతీలకు ప్రతీ నెల నిధులు విడుదల చేస్తున్నట్లు, ఇప్పటికే ఇజిఎస్ కింద సిద్ధిపేట జిల్లాలో 28 కోట్ల 32 లక్షల రూపాయలు బిల్లు క్లియరెన్స్ చేశామని, పెండింగ్ బిల్లులు ఉంటే ప్రతిపాదనలు ఇవ్వండి రెండు రోజుల్లో క్లియరెన్స్ చేయిస్తామని హరీష్ రావు తెలిపారు.  పట్టణ, పల్లె ప్రగతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని, వీరిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యులేనని హెచ్చరించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనులు అమలుకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లను నియమించినట్లు వెల్లడించారు.  పనులు నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
కంపోస్ట్ షెడ్ లు నిర్మాణం పూర్తి చేయడమే కాక చెత్త సెగ్రి గేషన్ జరగాలని, వాటిని వాడుకలో తీసుకు రావాలని, చెత్త సేకరణ చేసి డంప్ యార్డ్ తరలించి చెత్త వేరు చేయాలని, పంచాయతీ కార్యదర్శులకు తీపి కబురు చెబుతూ వారి స్కెల్ వేతనాలు ఇచ్చేందుకు సిఎం కెసిఆర్ సుముఖత వ్యక్తం చేశారని, ఏప్రిల్ మాసం నుంచే అమలు జరుగుతాయని, పల్లె ప్రగతిలో గ్రామ సర్పంచ్ అకౌంట్ లోకి నేరుగా, పట్టణ ప్రగతిలో మున్సిపల్ అకౌంట్ లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు.  పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా పాడుబడ్డ బావులు, బొందలు, బోర్లు ఉంటే వెంటనే పూడ్చివేయాలని అధికారులకు ఆదేశించారు.  గ్రామాలలో ఎక్కడ కూడా విరిగిపోయిన కరెంట్ స్తంభాలు, తుప్పు పట్టినవి ఉంటే వెంటనే తొలగించాలని విద్యుత్ అధికారులకు సూచించారు.
గ్రామాలలో ట్రాన్స్ ఫార్మర్ లు కాలి పోకుండా చూసి కావాలంటే అదనపు ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేయించాలని ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనులు ముమ్మరం చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు హరీష్ ఆదేశాలు జారీ చేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. పల్లె, పట్టణ ప్రగతిని ఎప్పుడైనా కెసిఆర్ ఆకస్మిక తనిఖీ చేసి అవకాశం ఉందని,  ఈ యాసంగిలో 4లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామని, ఇదంతా కాళేశ్వరం జలాలతో సాధ్యమైందన్నారు.  జిల్లాలో పామాయిల్ తోటలు పెంపు, సాగునకు యోగ్యంగా ఉందని, ఆయిల్ ఫామ్ సాగు, మల్బరీ సాగు విరివిగా చేపట్టేలా రైతులను చైతన్యం చేయాలని అధికారులకు సూచించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News