Saturday, April 20, 2024

వైద్య రంగంలో తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao Speech in Telangana Assembly

హైదరాబాద్: తెలంగాణపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”దేశంలోని అన్ని రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. ఒక్కో కాలేజీకి 200 కోట్లు మంజూరు చేసింది. మనకు మొండి చేయు చూపింది. మన విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదు. వైద్యారోగ్య రంగాన్ని ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్యను 33కి పెంచుకుంటున్నం. ఉక్రెయిన్ వెళ్లిన మన విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. గత పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం. వైద్య విద్య కోసం భాష రాకపోయినా ఉక్రెయిన్, చైనా తదితర దేశాలకు వెళ్లి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నందు వల్ల విద్యార్థులు ఇక్కడే వైద్య విద్యను చదువుకోవడం సాధ్యం కానున్నది. బస్తీ దవాఖానలు గొప్పగా సేవలు అందిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో దేశంలో మొదటి సారి ఏర్పాటు చేసిన ఈ బస్తీ దవాఖానపై 15వ ఆర్థిక సంఘం ప్రశంసలు కురిపించింది. దేశం మొత్తం ఈ విధానం అనుసరించాలనీ సూచించింది. 350 ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం 259 సేవలు అందిస్తున్నాయి. త్వరలో మిగతా చోట్ల అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు 81 లక్షల మంది సేవలు పొందారు. బస్తీ దవాఖానల నుండి టెలి మెడిసిన్ సేవలు సైతం అందిస్తున్నాం. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వైద్యులు ఈ విధానం ద్వారా అవసరమైన సేవలు అందిస్తున్నారు. ఉచితంగా 57 రకాల పరీక్షలు, ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడం వల్ల పట్టణ పేదలకు ఎంతో ఉపయోగం ఉంది. రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అన్ని పట్టణాల్లో 60 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయబోతున్నాం” అని తెలిపారు.

Harish Rao Speech in Telangana Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News