Saturday, April 20, 2024

హరితహారం ప్రజా ఉద్యమంగా మారింది: గువ్వల

- Advertisement -
- Advertisement -

Modi govt neglect Telangana state

హైదరాబాద్: హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. శానసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా గువ్వల అసెంబ్లీలో మాట్లాడారు.  వానలు వాపస్ రావాలని, కోతులు అడువులకు వెళ్లాలనేది సిఎం కెసిఆర్ నినాదమని, హరితహారం ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వలస పోయినవాళ్లు వాపస్ వస్తున్నారని, ఐక్యరాజ్యసమితి కూడా హరితహారాన్ని ప్రశంసించిందని గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ ఒక విజన్‌తో ముందుకెళ్తున్నారని, కెసిఆర్ పట్టణాల్లో కూడా పార్క్‌లను అభివృద్ధి చేశారని, సిఎం  చేపట్టిన ఎజెండా వందశాతం విజయవంతమవుతోందని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. గ్రీనరీని పెంచేందుకు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని గువ్వల వివరించారు. చైనా, బ్రెజిల్ తరువాత మొక్కల పెంపకంలో తెలంగాణ ముందువరసలో ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News