Home ఆఫ్ బీట్ శాటిలైట్ ట్రాక్టర్లు

శాటిలైట్ ట్రాక్టర్లు

                          Moon

చంద్రునిపై బోలెడంత హీలియం-3, సిలికాన్ వంటి విలువైన ఖనిజాలున్నాయి. గూగుల్ సంస్థ లూనార్ ఎక్స్‌ప్రెస్ పేరుతో కొన్నేళ్ల క్రితం జాబిల్లిపై ఉండే వనరులను వాడుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందించిన వారికి రెండు కోట్ల డాలర్ల బహుమతి ప్రకటించింది. ఈ పోటీలో విజయం సాధించే స్థితిలో ఉన్న అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మూన్‌ఎక్స్‌ప్రెస్ జాబిల్లిపై ఉన్న వనరులను భూమ్మీదకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.

జాబిల్లిపై మైనింగ్‌కు ముందుగా తాము రెండు అంతరిక్ష నౌకలను ఉపయోగిస్తామని తెలిపింది. రెండేళ్లలో ప్రయోగాలు జరిపి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తామని చెబుతున్నారు. 2020లో హార్వెస్ మూన్ ప్రయోగంతో అక్కడి రాతి నమూనాలను సేకరించి భూమిపైకి తెస్తామని తెలిపింది. దీనికోసం వ్యోమగాములు అవసరం లేదంటున్నారు. ఎంఎక్స్-5, డిస్కవరీ క్లాస్ ఎక్స్‌ప్లోరర్ వంటి యంత్రాల సాయంతో నమూనాలను సేకరిస్తామని పరిశోధకులు చెబుతున్నారు. అనంతరం ఎంక్స్1 ఈ ల్యాండర్ ద్వారా వాటిని భూమిపైకి చేరుస్తాయని ప్రకటించింది మూన్ ఎక్స్‌ప్రెస్. చంద్రునిపై అంతరిక్ష నౌకలను ల్యాండ్ చేసేందుకు ప్రభుత్వ అనుమతులు కూడా సాధించినట్లు కంపెనీ తెలిపింది.