Home ఎడిటోరియల్ ఉన్నతాధికారుల ఫ్యూడల్ ధోరణి!

ఉన్నతాధికారుల ఫ్యూడల్ ధోరణి!

Haryana CM meets modi, discusses farmer issues

 

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో వారు బారికేడ్లు దాటితే “తలలు పగుల కొట్టండి” అని హర్యానాలోని కర్నల్‌లో సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఒక యువ ఐఎఎస్ అధికారి ఆయూుష్ సిన్హా పోలీసులను ఆదేశించారు. వెంటనే పోలీసులు లాఠీలతో విరుచుకుపడి పది మంది రైతులను తీవ్రంగా గాయపరిచారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ హాజరైన బిజెపి సమావేశం వద్ద జరిగిన ఆ సంఘటన వీడియో బాగా వైరల్ అయ్యింది. బ్రిటిష్ వలస పాలన లో లాహోర్ పోలీస్ సూపరింటెండెంట్ జేవ్‌‌సు స్కాట్ లాలాలజ్‌పత్‌రాయ్ తల పగటకొట్టడం వల్ల ఆ తరువాత ఆయన ప్రాణాలు వదిలారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా ఈ బాధాకరమైన విషయం జ్ఞప్తికొస్తుంది. “ఆ ఐఎఎస్ ఆఫీసర్ ఉపయోగించిన మాటలు సరికాకపోయినప్పటికీ, శాంతి భద్రతలు పరిరక్షించాల్సి వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించక తప్పదు” అని హర్యానా ముఖ్యమంత్రి సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌ను సమర్థిస్తూ మాట్లాడడం చాలా విచారకరం.

“ఆ ఉద్రిక్త వాతావరణంలో ఆయూుష్ సిన్హా కొన్ని పదాలు ఉపయోగించారు. ఆ పదాలు ఉపయోగించకుండా ఉండాలి. కానీ ఆయన ఉద్దేశం మాత్రం తప్పుకాదు” అని జిల్లా మేజిస్ట్రేట్ నిషాంత్ యాదవ్ మరింత అసంబద్ధంగా అన్నారు. ప్రజల రక్షణకు సంబంధించిన చట్టాన్ని, పోలీసుల బాధ్యతను ఇద్దరు అధికారులు ఉల్లంఘించారు. ఆందోళన చేయడాన్ని, రోడ్లను దిగ్బంధించడాన్ని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడాన్ని దేశం మునుపెన్నడూ ఎరగనట్టు, ఇదే మొదటి సారిగా చూస్తున్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసే రైతుల పట్ల కఠినంగా వ్యవహరించమని ప్రజల నుంచి తనకు అనేక ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, అయి నా పాలనా యంత్రంగా చాలా సంయమనంతో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చెప్పడం గమనార్హం. దేశంలో చట్టాన్ని అమలు చేసే పద్ధతు లు చట్టం నిర్దేశించినట్టుగా కాకుండా కొందరు కోరినట్టుగా ఉండాలన్నట్టు ముఖ్యమంత్రి భావనగా వ్యక్తమవుతోంది. “ఉద్రిక్త వాతావరణం” అంటూ జిల్లా మేజిస్ట్రేట్ అవగాహన అసంబద్ధం.

“తలలు పగులగొట్టండి” అని బలంగా, ఉద్దేశపూర్వకంగా సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ అనడం తెచ్చిపెట్టుకున్న మాటలు. ‘ఫౌజీ’ సినిమా తరహాలో తన ఆదేశాలు పాటించాలని ఆయన మాటిమాటికీ పోలీసులను ఆదేశించారు. ఆ ‘ఉద్రిక్త వాతావరణం’ లో ప్రజలు కూడా రెచ్చిపోయి సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌కో, మరొక పోలీసుకో తల పగులగొడితే, వృషణాలపైన కొడితే రక్తనాళాలు దెబ్బతిన మరణం సంభవించదా? పని ఒత్తిడి అనో, అనుభవ రాహిత్యమనో చెపితే క్షమార్హం కాదు. చట్టప్రకారం విశేష అధికారాలు వచ్చినప్పుడు తమ చర్యలకు సమాధానం చెప్పుకోవలసిన బాధ్యత కూడా ఉంటుంది. ఆందోళనాకారులపైన పోలీసుల ద్వారా బలప్రయోగం జరిపినప్పుడు,మానసిక, సామాజిక కారణాలతో ఇలా ప్రవర్తించినప్పుడు ఉన్న చట్టపరమైన సమస్యలను పరిశీలిద్దాం. శాంతియుతంగా నిరసన తెలిపే వారికి ఉన్న ప్రజాస్వామిక హక్కులను బాబూలాల్ పరాటె (1961), అనితా ఠాకూర్ (2016), బల్‌దేవ్ సింగ్ గాంధీ (2002), రామిల్లా మైదాన్ (2012), మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (2018). బిమల్ గురుంగ్ (2018) వంటి కొన్ని కేసులలో ఉటంకించారు.నిరసనలు ఎలా చేపట్టవచ్చో అమిత్ షాహ్ని(2020) కేసులో షహీనాబాగ్ నిరసనలో స్పష్టం చేశారు.

ఈ కేసుల్లో ప్రశంసనీయమైన వ్యక్తీకరణలు ఉన్నప్పటికీ, చట్టం మాత్రం శ్మశాన పొగమంచులో మునిగి ఉంది. చట్టంలోని అంశాలకు వివరణ ఇవ్వడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చింది. పరిస్థితులను బట్టి తమకు అనుకూలంగా ప్రజలపైన స్వారీ చేస్తోంది. భారత దేశంలో గత 160 సంవత్సరాలుగా ప్రజలకు జరుగుతున్న అతి పెద్ద అన్యా యం ఇది. ఏది శాంతియుతమైన నిరసన? ఏది హింసాపూరితమైన నిరసన? అని ఎవరు గుర్తించాలి? హింసాపూరితమైన నిరసనకు కచ్చితమైన నిర్వచనమేంటి? మానవ సమూహం ఎలా చేస్తే హింసాపూరితం? ఎలా చేస్తే అహింసాపూరితం? ప్రజల ప్రయోజనాల రీత్యా సహేతుకమైన ఆంక్షలను ఎవరు గుర్తించాలి? ప్రభుత్వం దేన్ని విధిస్తుంది? మేజిస్ట్రేట్‌లు ఏ సాధికారతతో అంచనా వేస్తారు?ఎక్కడా వీటికి సమాధానాలు లేవు. పోలీసులు విధించిన ఆంక్షలు సహేతుకమైనవా కాదా అన్నది హిమత్ లాల్ కె.షా (1973), రైల్వే బోర్డు (1969) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (1999), మేచినేని కిషన్ రావు (2002) కేసులలో వచ్చిన తీర్పుల్లో కూడా వివరించ లేదు.

ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఆదేశాలు హేతబద్ధంగా లేకపోయినప్పటికీ గుడ్డిగా అనుసరిస్తే, తమ ప్రాథమిక హక్కులను ఎలా ఉపయోగించుకోగలుగుతారు? ఆచార్య జగదీశ్వరానంద అవధూత (2004) నిర్వహించిన ప్రదర్శనలో నిషేధిత ఆయుధాలు ఉండడానికి సమాధానాలు లేవు. వివిధ రకాల ఆయుధాలతో పోలీసులపైన ప్రజలు కానీ, గుంపులు కాని దాడి చేస్తే, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తే, ప్రభుత్వ, ప్రజలలో ఎవరిపైనైనా దాడి చేస్తే, వేధిస్తే (హర్యానాలో 2016 ఫిబ్రవరిలో జరిగినజాట్ రిజర్వేషన్ ఉద్యమ సమయంలో ముర్తల్ సామూహిక అత్యాచారం) హింసాత్మక గుంపు ల గురించిన రకరకాల చట్టాలు వర్తిస్తాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 129 ప్రకారం చట్ట వ్యతిరేకంగా సమావేశమైన వారిని చెదరగొట్టడానికి మారణాయుధాలను ఉపయోగించే అధికారాన్ని పోలీసులకు ఇస్తోం ది. అసలు చట్ట వ్యతిరేక సమావేశం అంటే ఏమిటి? చట ్టవ్యతిరేక సమావేశాన్ని నిషేధించే సెక్షన్ 141 అణచివేతలోనే వలసవాద స్వభా వం ఉంది. వేటిని చట్ట వ్యతిరేక సమావేశాలు అంటారనేది వలసవాదులు పెద్ద జాబితానే తయారు చేశారు. ఆధునిక భారత దేశం కూడా ఒక పిచ్చితో, ఒక ఉన్మాదంతో ఈ చట్టాలను కొనసాగిస్తోంది. అయిదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడితే నేరంగా పరిగణిస్తారు.

నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దేశం పార్లమెంటుపై అయిదుగురు ఏం చేయగలరో ఊహించండి! క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 129లో చట్టపరమైన శక్తి కచ్చితంగా ఎంత ఉందో కరమ్ సింగ్ (1979) కేసులో చర్చించారు. ఇప్పటికీ సమాధానం లేకుండానే మిగిలిపోయాయి. అసలు లక్ష్మణరేఖ ఎక్కడ ఉంది? ఏ హద్దులు దాటితే పోలీసులు మారణాయుధాలను వాడవచ్చు? ప్రజలు ఎంతదూరంలో ఉంటే పోలీసులు మారణాయుధాలను వాడవచ్చు? కనీసం ఎంత మంది అధికారులకు గాయాలయ్యే వరకు పోలీసులు వేచిచూడాలి? గాయాలైతే అవి ఎలాంటివి? ఎంత మంది అధికారులు గాయపడితే చర్యలు చేపట్టాలని ఏ చట్టం, ఏ తీర్పు చెపుతోంది? ఐపిసి సెక్షన్ 129లో ఎక్కడుంది? ఎలాంటి పరిస్థితిలో, ఎంత మంది పోలీసులను ఉపయోగించాలి? ఆందోళనాకారులు రైల్‌ట్రాక్‌లను ధ్వంసం చేసినప్పుడు, పోలీసు వాహనాలను కానీ, ప్రైవేటు వాహనాలను కానీ తగలపెడుతుంటే కాల్పులు జరపవచ్చా? నిరసనకారులు మహిళపై అత్యాచారం చేస్తున్నప్పుడు, మానభంగం చేస్తున్నప్పుడు కాల్పులు జరపవచ్చా? అధికార పార్టీ విస్తృత ప్రయోజనాలు దెబ్బ తింటున్నప్పుడు పోలీసులను ప్రయోగించవచ్చా? ఆగస్టు 2012 లో జరిగిన ఆజాద్ మెయిడన్ గొడవల సందర్భంగా అయిదుగురు మహిళా పోలీసులపై అత్యాచారం చేశారు.

పోలీసులు కళ్ళప్పగించి చూస్తుండిపోయారే కానీ, ఏమీ చేయలేకపోయారు. అత్యాచారం చేస్తున్న గుంపుపై పోలీసులు కాల్పులు జరిపినట్టయితే, వెంటనే వారికి ప్రమాదం సంభవించదా? ట్యుటికోరిన్‌లో 2018 మేలో జరిగిన పోలీసు కాల్పులలో ఇదే జరిగింది. తుత్తుకుడిలో రాగి పరిశ్రమను విస్తరింప చేయడాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళన సందర్భంగా జరిగిన కాల్పుల్లో 13 మంది మరణించారు, 102 మంది గాయపడ్డారు. కేవలం రెండు వందల గజాల దూరం నుంచి పోలీసులు వాహనాల పైకెక్కి కాల్పులు జరుపుతున్నట్టు ఫోటోలు లభ్యమయ్యాయి. పదమూడు మంది మరణించిన ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన సిబిఐ ఒక ఇన్‌స్పెక్టర్ పైన, 71 మంది ఆందోళనకారులపైన కేసులు పెట్టింది. ఎక్కువ నిగ్రహాన్ని పాటించి, అతి తక్కువ బలాన్ని ఉపయోగించండి అన్న నీతి వాక్యాలు ఎక్కడా కనిపించవు. ఐక్యరాజ్య సమితి చెప్పిన ‘బలప్రయోగం జరిపేటప్పుడు, మారణాయుధాలను వాడే సమయంలో మౌలిక సూత్రాలు హాస్యాస్పదంగా తయారయ్యాయి. సంఘటనా స్థలంలో ఉన్న అధికారే సరైన నిర్ణయం తీసుకోవాలని పంచన్ లాల్ (1977), అఖిలేశ్ ప్రసాద్ (1981) డి.ఎన్. శ్రీవాస్తవ (1982) మనోజ్ శర్మ (2006) తదితర కేసుల తీర్పుల్లో వెల్లడైంది.

కాల్పులకు అనుమతిచ్చినప్పుడు మాత్ర మే మారణాయుధాలను ఉపయోగించాలి కానీ, “తలలు పగుల కొట్టండి” వంటి ఆదేశాలకు కాదు. కత్తులతో ఆందోళన జరిగినప్పుడు కూడా పోలీసులు కత్తులను ఉపయోగించ కూడదు. లాఠీలను మాత్రమే ఉపయోగించాలి. అది కూడా తలపైన కొట్టకూడదు. ఆయుధ చట్టం ప్రకారం స్వల్ప విద్యుత్ షాక్ ట్రీట్‌మెంట్ వంటి ‘టేజర్’ను కూడా ఉపయోగించకూడదు. ఉన్నతాధికారులు కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన మేజిస్టీరియల్ అధికారాలున్న వారు; ముఖ్యంగా పోలీసులు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు ఫ్యూడల్ తరహా సామాజిక హోదాతో వ్యవహర్తిస్తున్నారు. ఒక్క పరీక్ష ద్వారా సివిల్ సర్వెంట్లను ఎంపిక చేయడమనే వలసవాద విధానమే మౌలికంగా తప్పుడు పద్ధతి. ఈ విధానం ప్రజలను పాలించడానికే ఉన్నామనే భావన కల్పింస్తుందే తప్ప, సేవ చేయడానికి ఉన్నామన్న స్పృహను వారిలో ఏ మాత్రం కల్పించదు.

Haryana CM meets pm modi, discusses farmer issues