Home జాతీయ వార్తలు రేపు మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల పోలింగ్

రేపు మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల పోలింగ్

Haryana, Maharashtra Assembly polls

 

హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం అయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాలతోపాటు దేశంలోని 51 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుండగా, మహారాష్ట్రలో 3,239 మంది, హర్యానాలో 1,168 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహారాష్ట్రలో 8,95,62,706 మంది ఓటర్లు ఉండగా.. 90,403 పోలింగ్ కేంద్రాలు, హర్యానాలో 1,82,98,714 మంది ఓటర్లు ఉండగా… 19,425 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.

Haryana, Maharashtra gear up to Assembly polls tomorrow