Home జిల్లాలు  పియు వైస్ ఛాన్సలర్‌గా రాజరత్నం

 పియు వైస్ ఛాన్సలర్‌గా రాజరత్నం

mbnrపాలమూరు: పాలమూరు యూనివర్శిటీ (పియు) వైస్ ఛాన్సలర్‌గా భూక్యా రాజరత్నం సోమవారం నియమితులయ్యారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా దార్ల మండలం కొల్లూరు గ్రామానికి చెందిన భూక్యా రాజరత్నం యూనివర్శిటీలలో పలు పదవులు నిర్వర్తించి పాలమూరు యూనివర్శిటీకి ఉపకులపతిగా నియామకమయ్యారు. రాజరత్నం 1992 నుంచి 2007వరకు పిజి సెంటర్ ప్రిన్సిపల్‌గా, 2008 నుంచి 2010వరకు ఉస్మానియా యూనివర్సిటీలో అదనపు పరీక్షల నిర్వహణ కంట్రోలర్‌గా పనిచేశారు. 2010నుంచి 2016వరకు ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్‌హౌస్ డైరెక్టర్‌గా, 2016 ఏప్రిల్ నుంచి నేటి వరకు సికింద్రాబాద్‌లోని పిజి కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలోని ముగ్గు రిలో గిరిజన తె గకు చెందిన భూ క్యా రాజర త్నంను సిఎం కెసిఆర్ సోమ వారం పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా భూక్యా రాజరత్నంను నియమిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. సామాజిక తెగకు చెందిన తనను పియు వైస్ ఛాన్సలర్‌గా నియమించిన సిఎంకు రాజరత్నం కృతజ్ఞతలు తెలపారు.